ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ | Sakshi
Sakshi News home page

ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ

Published Fri, Nov 17 2023 1:24 AM

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి   - Sakshi

గద్వాల రూరల్‌: వానాకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులు ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులకు ఇబ్బందులకు గురిచేయవద్దని హెచ్చరించారు. అదేవిధంగా తేమశాతం, నాణ్యతా పరీక్షలు, ధాన్యం సేకరించిన అనంతరం రైతుల ఖాతాలో సకాలంలో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ పరీక్ష యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, గన్నీబ్యాగులు, తూకం కాంటాలు అన్ని సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు క్రమపద్ధతిలో టోకెన్లు జారీచేయాలన్నారు. ధాన్యం ప్రభుత్వం చెలించే ఏగ్రేడ్‌ రకానికి రూ.2203, సాధారణ రకానికి రూ.2183 చెల్లిస్తుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు ధాన్యం రాకుండా చెక్‌పోస్టు వద్ద గట్టి నిఘా ఉంచాలన్నారు. అనంతరం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ఏఈవో, ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్‌ నిర్వాహకులకు పీపీటీ ద్వారా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఖరీఫ్‌లో కొనుగోలు ప్రక్రియకు సంబంధించి పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అపూర్వ్‌చౌహాన్‌, డీఆర్‌డీవో ఇంచార్జీ అధికారి కాంతమ్మ, మార్కెటింగ్‌ అధికారి పుష్పమ్మ, డీఎస్‌వో రేవతి, డీఏవో గోవిందునాయక్‌, డీసీవో ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement