ఈవీఎం గోదాం తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం గోదాం తనిఖీ

Jun 10 2026 1:49 AM | Updated on Jun 10 2026 1:49 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మంగళవారం జిల్లాకేంద్రంలోని ఈవీఎం, వీవీ పాట్‌ గోదామును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు, వీవీపాట్‌ యంత్రాల భద్రతను పరిశీలించారు. గోదాంలో అమలు చేస్తున్న భద్రతా చర్యలు, సీసీటీవీ పర్యవేక్షణ, అగ్నిమాపక పరికరాలు, డబుల్‌ లాక్‌ సిస్టమ్‌ అంశాలను కలెక్టర్‌ పరిశీలించారు. యంత్రాల నిర్వహణ రికార్డులు, స్ట్రాంగ్‌ రూమ్‌ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. తనిఖీలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అబ్బాస్‌, నవీన్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement