ఖర్చు పెరుగుతోంది.. | - | Sakshi
Sakshi News home page

ఖర్చు పెరుగుతోంది..

Jun 10 2026 1:49 AM | Updated on Jun 10 2026 1:49 AM

ఖర్చు పెరుగుతోంది.. రెండువైపులా భారం..

జిల్లా కేంద్రంలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాను. డ్రైవర్‌గా పని చేస్తూనే మా ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్‌లో చదివిస్తున్నా. చదువుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అధిక మొత్తం వరకు డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. దీనికి తోడు రోజువారీ ఖర్చులు నిత్యావసరాలు, ఇంటి అద్దె పోనూ రూపాయి కూడా మిగలడం లేదు. మళ్లీ కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది.

– తిక్క రాజు, హన్‌మాన్‌నగర్‌, భూపాలపల్లి

జూన్‌ వచ్చిందంటే చాలు రెండువైపులా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఒకవైపు పిల్లల చదువులపై, మరోవైపు పంట పెట్టుబడులు, ఇలా రెండు వైపులా ఒకేసారి ఒకే నెలలో ఖర్చు పెట్టాల్సి రావడంతో భారంపడుతోంది. రైతు భరోసా డబ్బులు త్వరగా ఇవ్వాలి.

– కె.శ్రావణ్‌రెడ్డి, చింతలపల్లి, మహాముత్తారం

Advertisement
 
Advertisement
Advertisement