భూపాలపల్లి: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్ కార్యాలయంలో అభినందించి ప్రశంస పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడంలో ప్రతీ పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. క్రమశిక్షణ, నిజాయితీ, సేవాదృక్పథంతో విధులు నిర్వర్తించే సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
గణపురం పోలీస్‌స్టేషన్ తనిఖీ
గణపురం: గణపురం పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించి నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గణపురం సీఐ కరుణాకర్ రావు, ఎస్‌ఐ అశోక్ ఉన్నారు.


