కాకతీయుల శిల్పసంపద అద్భుతం
ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రమేష్‌బాబు
గణపురం: కాకతీయుల పాలనలో నిర్మించిన ఆలయాల శిల్పసంపద ఎంతో అద్భుతమని, ఈ వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి చిట్టూరి రమేష్‌బాబు అన్నారు. కార్తీక శుక్రవారం సందర్భంగా ఆయ న కోటగుళ్లను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి రుధ్రాభిషేకం చేశారు. ఆలయంలో పూజల అనంతరం ఆయనకు అర్చకులు నాగరాజు శాలువా, పూల దండలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందచేశారు.
హారతి వేదికకు
గొడుగు ఏర్పాట్లు
కాళేశ్వరం: ఈ ఏడాది మే నెలలో కాళేశ్వరంలో సరస్వతీనది పుష్కరాల సమయంలో కాశీపండితులచే అట్టహాసంగా గోదావరిహారతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. పుష్కరాల సమయంలో ఏడు హారతి వేదికలు నిర్మించారు. ప్రస్తుతం ఏడు వేదికలపై తొమ్మిది హారతులను ఇచ్చేందుకు గొడుగు ఏర్పాట్లు చేస్తున్నారు. సరస్వతీనది పుష్కరాల నుంచి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రతి రోజు మూడు హారతులతో హారతి కార్యక్రమాన్ని దేవస్థానం పండితులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కార్తీకమాసంలో ముఖ్యమైన పంచరత్నాల్లో భాగంగా (నేడు) శనివారం నుంచి పౌర్ణమి వరకు పంచతర్న హారతి కార్యక్రమం ఉండనున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఇనుముతో గొడుగులు ఏర్పాటు చేస్తున్నారు. పనులను ఈఓ మహేష్ పర్యవేక్షిస్తున్నారు.
ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణం పూర్తి చేయాలి
రేగొండ: ప్రజలకు మెరుగైన వైద్యసదుపాయాలు అందించేందుకు నిర్మాణంలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రం పనులను త్వరగా పూర్తి చేయాలని డీఎంహెచ్‌ఓ మధుసూదన్ అన్నారు. మండలంలోని సుల్తాన్‌పూర్, చెన్నాపూర్, మడ్తపల్లి గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రాం అధికారి చిరంజీవి, మండల వైద్యాధికారి హిమబిందు ఉన్నారు.
అసంక్రమిత వ్యాధులపై అవగాహన
చిట్యాల: మండలంలోని ఒడితల పీహెచ్‌సీలో అసంక్రమిత వ్యాధులపై ఏఎన్‌ఏంలకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎంహెచ్‌ఓ మధుసూదన్ హాజరై మాట్లాడారు. అసంక్రమిత వ్యాధులు అంటు వ్యాధులు కావని అన్నారు. కానీ, ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఉందని తెలిపారు. మానవ జీవన శైలి, ఆహార అలవాట్లు జన్యపరంగా సంక్రమిస్తాయని వివరించారు. అనంతరం ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా ఏఎన్‌ఎంల పని తీరు పరిశీలించి మరింత మెరుగు పరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ పోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సందీప్, పీహెచ్‌సీ వైద్యాధికారి మౌనిక, ఏఎన్‌ఏంలు పాల్గొన్నారు.
కాకతీయుల శిల్పసంపద అద్భుతం
కాకతీయుల శిల్పసంపద అద్భుతం


