ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
కాటారం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అదన పు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని ధన్వాడ, శంకరాంపల్లి, రేగులగూడెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను శుక్రవారం అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి, బిల్లుల చెల్లింపు వివరాల గూర్చి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ని ర్మాణాల స్థితిగతులపై మండల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరి
కాటారం: రైతులు, పశుపోషకులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ముందస్తుగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి అన్నారు. కాటారంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. మండలంలో ఎన్ని పశువులకు టీకాలు వేశారు. టీకాల ప్రక్రియ నిర్వహణపై ఆరా తీశారు. పశువైద్యులు, సిబ్బంది అన్ని గ్రామాల్లోని పశువులకు టీకాలు వేయాలని ఆదేశించారు. గాలికుంటు వ్యాధి లక్షణాలపై పశుపోషకులకు అవగాహన కల్పించాలని సూచించారు. మండల పశువైద్యాధికారి రమేశ్, డాక్టర్ ధీరజ్, పశువైద్య సహాయకులు తుంగల రాజశేఖర్, గోపాలమిత్ర శ్రీనివాస్, పశుమిత్ర నజీమా పాల్గొన్నారు.
పశువులకు టీకా వేయించాలి
కాళేశ్వరం: పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా టీకా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి అన్నారు. మహాదేవపూర్ మండలంలో కొనసాగుతోన్న గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. టీకా ప్రక్రియను, కోల్డ్ చెయిన్ నిర్వహణను, చెవి పో గుల ప్రక్రియను, భారత్ పశుధాన్ మొబైల్ యాప్ లో ఆన్‌లైన్ అప్‌లోడ్ విధానం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. గాలికుంటు నివారణ టీకా పశువులను వైరల్ వ్యాధుల నుంచి రక్షించడంలో, రైతుల ఆర్థిక నష్టాలను నివారించడంలో ఉపకరిస్తుందన్నారు. పశువైద్య సహాయ శస్త్ర వైద్యుడు రాజబాపు, పారా స్టాఫ్ తిరుపతి, నాగభూషణం, గోపాల మిత్రులు రాజబాపు, బాన య్య, సిబ్బంది లక్ష్మణ్, లావణ్య, రమేశ్ ఉన్నారు.
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి


