
రైతుల గోస మంత్రికి పట్టదా..
కాటారం: మంత్రి శ్రీధర్‌బాబు సొంత మండలం కాటారంలో రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నా ఆయనకు ఏ మాత్రమూ పట్టింపులేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. కాటారం మండలకేంద్రంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడిన రైతులను కలిసి పుట్ట మధు మాట్లాడారు. రెండు మూడు రోజులుగా యూరియా కోసం లైన్లలో నిల్చుంటున్నామని రైతులు పుట్ట మధుతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరతపై పుట్ట మధు పీఏసీఎస్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై శ్రీధర్‌బాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు, పప్పు దినుసు విత్తనాలు అందించడంలో ప్రభుత్వ విఫలమైందని విమర్శించారు. ఇప్పటికై నా రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పుట్ట మధు వెంట బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కు రాకేశ్, మండల ఇన్‌చార్జ్ జోడు శ్రీనివాస్, నాయకులు జక్కు శ్రావణ్, ఊర వెంకటేశ్వరరావు ఉన్నారు.
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు