కేయూ క్యాంపస్: బెంగళూరుకు చెందిన లాక్ష్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థతో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఎంఓయూతో వివిధ కంపెనీలతో నేరుగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ఉపాధి కూడా కల్పించే అవకాశం ఉంటుందని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎల్.జితేందర్ తెలిపారు. లాక్ష్ ఫౌండేషన్ సహకారంతో కెరీర్ మార్గదర్శక శిబిరాలు, పరిశ్రమల ఆధారిత అభ్యసన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. లా ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ప్లేస్‌మెంట్ మేనేజర్ వైద్యం రవికుమార్, సీనియర్ మేనేజర్ సునీల్ నుంచి కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి ఒప్పంద పత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రహమాన్, సాయిచరణ్, గిరిప్రసాద్, రమేశ్ పాల్గొన్నారు.


