● డీసీపీ రాజమహేంద్ర నాయక్
జనగామ రూరల్: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీలర్లు నడుచుకోవాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. మంగళవారం ఇనన్‌పుట్ డీలర్ల దుకాణాలపై టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. డీలర్ల వద్ద ఉన్న ఇ–పాస్ స్టాక్‌ను భౌతిక నిల్వలతో గ్రౌండ్ నిల్వలను పరిశీలించింది. డీసీపీ మాట్లాడుతూ.. వ్యవసాయ ఇనన్‌పుట్‌ల విక్రయాల్లో నిబంధనల అమలు, స్టాక్‌ల పారదర్శకత ఉండాలన్నారు. తనిఖీల్లో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, సీఐ సత్యనారాయణరెడ్డి, మండల వ్యవసాయ అధికారి రాధిక, జనగామ, వ్యవసాయ విస్తరణ అధికారి అనిల్ పాల్గొన్నారు.


