● నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ
కాజీపేట అర్బన్: విద్యార్థులు కళాశాలల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సూచించారు. నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో మంగళవారం విద్యార్థులు సందడి చేశారు. జోసా–26 (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్‌పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓపెన్‌హౌస్ కార్యక్రమాన్ని నిట్ డైరెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. నిట్, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, మిగతా ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చాయిస్ ఆఫ్ ఫిల్లింగ్‌లో తప్పులు చేయకుండా వివిధ కళాశాలలపై అవగాహన కల్పించేందుకు ఓపెన్‌హౌస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


