ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొత్తం సీట్లు 690 | - | Sakshi
Sakshi News home page

ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొత్తం సీట్లు 690

Jun 10 2026 1:49 AM | Updated on Jun 10 2026 1:49 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి..

జనగామ: జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ (అటానమస్‌) కళాశాల 2026–27 విద్యా సంవత్సరంలో రికార్డు స్థాయిలో అడ్మిషన్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. విద్యా ప్రమాణాలు, ఆధునిక మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులు, స్కాలర్‌షిప్‌లు, కెరీర్‌ గైడెన్స్‌ కార్యక్రమాలతో విద్యార్థులకు బంగారు భవిష్యత్‌ను అందిస్తోంది. ప్రస్తుతం కళాశాలలో మొత్తం 720 సీట్లకు అవకాశం ఉండగా, మొదటి రెండు విడతల అడ్మిషన్లలోనే గణనీయమైన స్పందన లభించింది. ముఖ్యంగా ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన బీకాం (బ్యాంకింగ్‌, ఫైనాన్‌న్స్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌, బీఎఫ్‌ఎస్‌ఐ), బీఎస్సీ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు 188 అడ్మిషన్లు కాగా, బీఎస్సీ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో 45 శాతం, బీకాం బీఎఫ్‌ఎస్‌ఐలో 50 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు ఈ కోర్సులపై ఆసక్తి చూపుతున్నట్లు కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ఓరియెంటేషన్‌ నిర్వహించారు.

కొత్త కోర్సుల్లో ప్రత్యేక ప్రయోజనాలు

బీఎస్సీ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌, బీకాం బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు పరిశ్రమలతో అనుసంధానమైన అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు లభిస్తాయి. శిక్షణ కాలంలో విద్యార్థులు నెలకు సుమారు రూ.15 వేల వరకు స్టైఫండ్‌ పొందే అవకాశం ఉంది.

ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం

కళాశాలలోని టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో రెగ్యులర్‌గా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మెగా జాబ్‌ మేళాల్లో పలువురు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పతకాలు సాధించడం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం కళాశాల ప్రతిష్టను మరింత పెంచుతోంది.

స్కాలర్‌షిప్‌లతో ఆర్థిక వెసులుబాటు

ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ప్రతిభ కనబరిచిన బాలికలకు అజిమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక స్కాలర్‌షిప్‌ అందుతోంది. ఎంపికైన విద్యార్థినులకు నెలకు రూ.30వేల చొప్పున మూడు సంవత్సరాలపాటు మొత్తం రూ.90వేల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ తదితర కేటగిరీల్లో రిజర్వేషన్ల ఆధారంగా ఇక్కడ సెలెక్టు చేసి పంపించగా, ఫౌండేషన్‌ నుంచి అర్హత కలిగిన విద్యార్థినులను గుర్తించి పేర్ల జాబితాను వెల్లడిస్తారు.

అడ్మిషన్ల కోసం విస్త్రత ప్రచారం

అడ్మిషన్ల పెంపు కోసం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో అధ్యాపక బృందం జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లోని ప్రభుత్వ, మోడల్‌, జ్యోతిబాఫూలే, గురుకుల వి ద్యాసంస్థలతో పాటు ప్రైవేటు పిల్లల వద్దకు వెళ్తూ అడ్మిషన్లపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో హాస్టల్‌ సౌకర్యం కల్పించేందుకు కళాశాల యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

మూడో విడతకు సిద్ధం

మొదటి రెండు విడతల అడ్మిషన్లు పూర్తికాగా, మూడో విడత రిజిస్ట్రేషన్లు ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి. 16న వెబ్‌ ఆప్షన్లు, 20న సీట్ల కేటాయింపు జరగనుంది.

30 వేలకుపైగా పుస్తకాలతో గ్రంథాలయం

12 కంప్యూటర్లతో డిజిటల్‌ లైబ్రరీ

కంప్యూటర్‌, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రయోగశాలలు

ఎన్సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, టీఎస్‌కేసీ విభాగాలు

నైపుణ్యాభివృద్ధి శిక్షణలు

కెరీర్‌ గైడెన్స్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌

క్రీడా సదుపాయాలు

పర్యావరణ క్లబ్‌, సామాజిక సేవా

కార్యక్రమాలు

కళాశాల ప్రత్యేకతలు :

కోర్సుల వారీగా అడ్మిషన్ల పరిస్థితి

720 సీట్ల భర్తీ లక్ష్యంతో ముందుకు

ఈ నెల 15 వరకు

మూడో విడత రిజిస్ట్రేషన్లు

విస్తృతంగా ప్రచారం చేస్తున్న

ప్రిన్సిపాల్‌, ఆధ్యాపక బృందం

ప్రస్తుత అడ్మిషన్లు

ఖాళీలు

కోర్సు మొత్తం ప్రస్తుత ఖాళీలు

సీట్లు అడ్మిషన్లు

బీఏ (తెలుగు, 180 32 148

ఇంగ్లిష్‌ మీడియం)

బీకాం 150 48 102

(కంప్యూటర్‌ అప్లికేషన్‌)

బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌ 120 23 97

బీఎస్సీ ఫిజికల్‌ సైన్సెస్‌ 120 38 82

బీకాం(బీఎస్‌ఎఫ్‌ఐ) 60 30 30

బీఎస్సీ 60 27 33

హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌

ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ (అటానమస్‌) కళాశాలకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించడం ఆనందంగా ఉంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టిన బీకాం(బీఎఫ్‌ఎస్‌ఐ), బీఎస్సీ హెల్త్‌కేర్‌ మేనేజ్‌ మెంట్‌ కోర్సులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలి. – శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల

Advertisement
 
Advertisement
Advertisement