జనగామ రూరల్: ప్రతీ ఓటు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని, పార్టీ సంస్థాగత బలోపేతం, ఓటరు జాబితాల పటిష్ట నిర్వహణకు ప్రతీ కార్యకర్త, బీఎల్‌ఏ(బూత్ లెవల్ ఏజెంట్) కృషి చేయాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు లకావత్ ధన్వంతి పాల్గొని మాట్లాడుతూ.. గ్రామాల్లో నాయకుల గెలుపునకు బీఎల్‌ఏలు ఎంతో కీలకమన్నారు. దొంగ ఓట్లు వేయకుండా వ్యక్తుల గుర్తింపునకు ఏజెంట్ పనిచేస్తారని, దొంగ ఓట్లపై కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు, బీఎల్‌లు మరింత కృషి చేయాలన్నారు. ఈనెల 21 నుంచి ప్రారంభం అయ్యే ‘సర్’ ప్రక్రియలో బీఎల్‌ఓలతో కార్యకర్తలు నిత్యం అందుబాటులో ఉండి పూర్తి వివరాలు సేకరించాలన్నారు. ఈ సర్వేలోనే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా లేదో తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, ట్రైనర్ డా.రాజశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి, కౌన్సిలర్‌లు లోకమంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఉడుత రవి, చెంచారపు కరుణాకర్ రెడ్డి, అనిత, సుమలత, రజిని, సర్పంచ్‌లు మల్లేష్, సత్యనారాయణ రెడ్డి, బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు.
పార్టీ సంస్థాగత బలోపేతానికి
బీఎల్‌ఏలు కృషి చేయాలి
బీఎల్‌ఏలకు శిక్షణలో ఎంపీ చామల,
కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి


