బంపర్‌ ఆఫర్‌! | - | Sakshi
Sakshi News home page

బంపర్‌ ఆఫర్‌!

Nov 2 2025 9:32 AM | Updated on Nov 2 2025 9:32 AM

బంపర్

బంపర్‌ ఆఫర్‌!

కొత్తగా మద్యం దుకాణాలు దక్కిన వారితో వ్యాపారులు బేరసారాలు అనుభవజ్ఞులకు కలిసిరాలే.. కొత్త మార్పులు.. ప్రభుత్వ పరిశీలన అవసరం

25 షాపులు కొత్తవారికే..

కొత్తగా మద్యం దుకాణాలు దక్కిన వారితో వ్యాపారులు బేరసారాలు

జనగామ: నూతన మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి కావడంతో.. కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్న వారికి వ్యాపారులు బంపర్‌ ఆఫర్‌ చేస్తున్నారు. నజరానా ఇస్తాం.. షాపు ఇస్తారా.. అంటూ ప్రలోభపెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీ 2025–27 ప్రకారం వైన్‌ షాపుల కేటాయింపులను ఇటీవల లాటరీ విధానంలో పూర్తి చేసింది. ఈసారి టెండర్లలో పాత మద్యం వ్యాపారులకు దురదృష్టం, కొత్త వారికి అదృష్టం కలిసి వచ్చింది. జిల్లాలో 50 మద్యం దుకాణాలకు 1,697 దరఖాస్తులు వచ్చిన విషయం విదితమే.

మూడు దశాబ్ధాలుగా మద్యం వ్యాపారంపై ఆధారపడి జీవనోపాధి కొనసాగించిన చాలా మంది అనుభవజ్ఞులకు ఈసారి లాటరీలో అదృష్టం కలిసిరాలేదు. బదులుగా వ్యాపార అనుభవంలేని, వైన్స్‌ వ్యాపారం ఎప్పుడూ చేయని కొత్త వారికి లాటరీలో లైసెన్స్‌లు కేటాయించబడ్డాయి. దీంతో మద్యం మార్కెట్‌ మొత్తం ఒక్కసారిగా కదిలిపోయింది.

కొత్త మద్యం పాలసీ అమలుతో జిల్లాలో పోటీ వాతావరణం మరింత పెరిగింది. టెండర్లతో మద్యం వ్యాపారం కొత్త దశలోకి అడుగుపెట్టింది. వైన్‌ షాపులు, డిస్ట్రిబ్యూటర్లు, సరఫరాదారుల మధ్య కొత్త ఒప్పందాలు కుదురుతున్నట్లు మాట్లాడుకోవడం కనిపిస్తోంది. జనగామ, పాలకుర్తి, బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌, నెల్లుట్ల మండలాల్లో వైన్స్‌ డీల్స్‌ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాత వ్యాపారులు మళ్లీ మార్కెట్‌లో తమ ప్రభావం కొనసాగించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

కొత్తవారు లైసెన్స్‌ పొందగానే షాపులు అమ్మకానికి పెట్టడం, పాతవారు వాటిని బేరసారాల రూపంలో కొనుగోలు చేయడంపై ప్రభుత్వం నిశితంగా గమని స్తున్నట్లు సమాచారం. మద్యం పాలసీ ఉద్దేశాన్ని వక్రీకరించే ఈ మార్పులపై ఎకై ్సజ్‌ అధికారులు ఓ కన్నేస్తున్నారు. కొత్త వైన్స్‌ లాటరీలు జిల్లా మద్యం మార్కెట్‌ను పూర్తిగా కుదిపేస్తున్నాయి. లక్కు తగి లిన కొత్తవారు ఆర్థికంగా ఎదుగుతుంటే, అనుభవజ్ఞులైన పాతవారు వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి కొత్త మార్గాల అన్వేషణలో ఉన్నారు.

కొత్త లైసెన్స్‌దారులు వైన్‌షాపులను నిర్వహించలేని పరిస్థితుల్లో భారీ లాభాలతో మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారు. జిల్లాలో 50 మద్యం దుకాణాల పరిధిలో 25 వరకు కొత్తవారికి లక్కు కలిసి వచ్చింది. ఇందులో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలో 8 వరకు అమ్మకానికి పెట్టగా, బచ్చన్నపేట, పాలకుర్తి, నెల్లుట్ల, కొడకండ్ల మండలాల పరిధిలో రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు డిమాండ్‌ పలుకుతోంది. ఇందులో బచ్చన్నపేటలో రూ.1 కోటి, పాలకుర్తిలో రూ.1.25 కోట్లు, నెల్లుట్లలో రూ.1.40 కోట్లు, జనగామ పట్టణంలో రూ.90 లక్షల నుంచి రూ.1 కోటి వరకు వైన్స్‌ అమ్మకాలకు డీల్‌ కుదుర్చుకుంటుండగా, కొడకండ్ల ప్రాంతాల్లో కూడా రూ.కోట్ల రూపాయల ఒప్పందాలు జరుగుతున్నట్లు సమాచారం. టెండర్లలో లక్కు తగిలిన కొత్త వారితో పాత వ్యాపారులు ఇప్పటికే బేరసారాలు కుదుర్చుకోవడం ప్రారంభించారు. పాతవారు తమ మార్కెట్‌ అనుభవం, సరఫరా వ్యవస్థను ఉపయోగించి కొత్తవారి షాపులను క్రమంగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేయత్నంలో ఉన్నారు. దశాబ్ధాలుగా మద్యం షాపులు నిర్వహిస్తూ జీవనం సాగించిన పాత వారికి ఈసారి లాటరీ ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించగా, కొత్త వారు మాత్రం ఉత్సాహంగా ఉన్నారు. బేరసారాలతో ఒప్పందం కుదుర్చుకోవడం, షాపుల విలువ పెరగడంతో లాటరీలో లక్కు కలిసి వచ్చిన వారిలో కొందరు కూర్చున్న చోటే కోటీశ్వరులుగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

రూ.కోట్లలో లైసెన్స్‌ డీల్స్‌

పాలకుర్తిలో అత్యధికం

లాటరీలో లక్కు.. వైన్‌షాపులతో

లక్ష్మీప్రసన్నం

బంపర్‌ ఆఫర్‌!1
1/2

బంపర్‌ ఆఫర్‌!

బంపర్‌ ఆఫర్‌!2
2/2

బంపర్‌ ఆఫర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement