కపాస్‌ కిసాన్‌ యాప్‌ను రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

కపాస్‌ కిసాన్‌ యాప్‌ను రద్దు చేయాలి

Nov 2 2025 9:32 AM | Updated on Nov 2 2025 9:32 AM

కపాస్

కపాస్‌ కిసాన్‌ యాప్‌ను రద్దు చేయాలి

లింగాలఘణపురం: కౌలు రైతులకు శాపంగా మారిన కపాస్‌ కిసాన్‌ యాప్‌ను రద్దు చేయాలని పత్తి రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చందునాయక్‌ డిమాండ్‌ చేశారు. శనివారం మండలంలో ఇటీవల తుపానుతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ తుపానుతో జిల్లా వ్యాప్తంగా సు మారు 32వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, పంటల బీమా పథకం చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పత్తి రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ మంగ బీరయ్య, నాయకులు గండి అంజయ్య, కేశవులు, పత్తి రైతులు ఉన్నారు.

5న అఖండ జ్యోతి దర్శనం

పాలకుర్తి టౌన్‌: ప్రముఖ పుణ్యక్షేత్రం సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 5న నిర్వహించే అఖండజ్యోతి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చే యాలని ఈఓ సల్వాది మోహన్‌బాబు కోరారు. శనివారం దేవస్థానం ఆవరణలో అఖండజ్యోతి ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శబరిమలై మకరజ్యోతిని పోలిన విధంగా క్షీరాద్రి శిఖరం పాలకుర్తి సోమేశ్వర క్షేత్రంలో దక్షిణ భారతదేశంలో మూడో అతిపెద్ద అఖండ జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అఖండ జ్యోతికి అవసరమైన నూనె, వత్తులు, కర్పూరాన్ని భక్తులు ప్రచారరథానికి అందజేయాలన్నారు. ప్రచార రథాల ద్వారా ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య, ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్‌శర్మ, దేవగిరి అ నిల్‌కుమార్‌, మత్తగజం నాగరాజు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

పాల శీతలీకరణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

దేవరుప్పుల: విజయ పాల శీతలీకరణ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విజయ డెయిరీ డీడీ ఎన్‌. గోపాల్‌సింగ్‌, జిల్లా చైర్మన్‌ కాసారపు ధర్మారెడ్డి అన్నారు. శనివారం దేవరుప్పుల మండలంలోని కామారెడ్డిగూడెంలో 1,000 లీటర్ల సామర్థ్యం గల విజయ పాల శీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పశుసంపదతో అదనపు ఆదా యం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు లింగారెడ్డి, మేనేజర్‌ లక్ష్మీ, సూపర్‌వైజర్‌ వెంకట్‌రెడ్డి, బీఎంసీయూ చైర్మన్‌ గు లాం రసూల్‌, మండల విజయడైయిరీ చైర్మన్‌లు, పాడిరైతులు పాల్గొన్నారు.

ఎంజీఎం సూపరింటెండెంట్‌ బాధ్యతల స్వీకరణ

ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శనివారం ఈఎన్‌టీ వైద్యుడు హరీశ్‌ చంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంజీఎంలో వైద్యసేవల లోపాలపై వరుసగా వస్తున్న కథనాలపై ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సూపరింటెండెంట్‌ కిశోర్‌పై వేటు వేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మంచిర్యాల సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్న డాక్టర్‌ హరీశ్‌చంద్రారెడ్డిను ఎంజీఎం సూపరింటెండెంట్‌గా నియమిస్తూ డీఎంఈ నరేంద్రకుమార్‌ గత నాలుగు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను ఎంజీఎం ఆర్‌ఎంఓలు వసంత్‌కుమార్‌, అశ్విన్‌, శశికుమార్‌, ఏడీ శ్రీనివాస్‌ కలిసి అభినందనలు తెలిపారు.

కపాస్‌ కిసాన్‌ యాప్‌ను  రద్దు చేయాలి
1
1/3

కపాస్‌ కిసాన్‌ యాప్‌ను రద్దు చేయాలి

కపాస్‌ కిసాన్‌ యాప్‌ను  రద్దు చేయాలి
2
2/3

కపాస్‌ కిసాన్‌ యాప్‌ను రద్దు చేయాలి

కపాస్‌ కిసాన్‌ యాప్‌ను  రద్దు చేయాలి
3
3/3

కపాస్‌ కిసాన్‌ యాప్‌ను రద్దు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement