● వరద ప్రభావిత బాధితులకు అండగా నిలిచిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, బల్దియా డీఆర్‌ఎఫ్
● కీలకంగా వ్యవహరించిన కమిషనరేట్ పోలీసులు
● నిరంతర విద్యుత్ సేవల్లో ఎన్పీడీసీఎల్ అధికారులు
● వారి సేవలను ప్రశంసిస్తున్న ముంపు బాధితులు
విద్యార్థినులకు ఆపన్నహస్తం..
రెండేళ్ల క్రితం 2023, జూలై 27న కురిసిన వర్షానికి హంటర్‌రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల భవనం మొదటి అంతస్తులోకి వర్షపు నీటితోపాటు పాములు, తేళ్లు వచ్చాయి. భవనం టెర్రాస్‌పై బిక్కుబిక్కుమంటూ రాత్రి నుంచి ఉదయం వరకు విద్యార్థినులు వేచి చూశారు. అప్పుడు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్ సాయంతో విద్యార్థినులను రక్షించారు. ఈ ఏడాది అక్టోబర్ 29న అదే పరిస్థితి ఎదురైంది. మోంథా తుపాను కారణంగా డిగ్రీ కళాశాల భవనం పూర్తిగా జలమయమైంది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు సుమారు 12 గంటల పాటు విద్యార్థినులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఆపన్న హస్తం కోసం ఎదురు చూశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ సారథ్యంలో ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రెండు బోట్ల సాయంతో 470 మంది విద్యార్థులను రక్షించి పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తమను రక్షించిన వారికి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు.
సల్లగా బతకమని ఆశీర్వదించింది..
సమ్మయ్యనగర్‌లో ఇళ్లు, చుట్టూ భారీగా వరద నీరు నిలిచిందని అందిన సమాచారంతో వరద నీటిలోకి వెళ్లాను. ఆ ఉధృతికి నాకే భయం వేసింది. కానీ, ధైర్యం చేసుకొని ముందుకు సాగాను. ఓ మహిళను తాడు సాయంతో ఎత్తుకుని బయటకు తీసుకొచ్చాను. ఆమె నన్ను ‘సల్లగా బతుకు’ అని ఆశీర్వదించింది.
– వి.శ్రీకాంత్, డీఆర్‌ఎఫ్
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్‌వాసులను రక్షించి..
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్‌వాసులను రక్షించి..


