పునరుద్ధరణ పనులు చేపట్టాలి
జనగామ రూరల్: వర్షాలతో నష్టపోయిన పంటల ను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేసి రైతు లకు భరోసా కల్పించాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మె ల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కడియం, కలెక్టర్ రిజ్వాన్‌బాషా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధప్రాతిపదికన నష్టాలను అధికారులు పక్కగా అంచనా వేయాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, కొట్టుకుపోయిన కల్వర్టులను వెంటనే మరమ్మతు చేపట్టాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేసి నివేదికలు అందించాలన్నారు. ఈ సమావేంలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బెన్ షాలోమ్, ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కడియం, కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలో డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రాధాన్యత క్రమంలో రూ.50కోట్ల పనులను చేపట్టాలన్నారు.
పంటల వివరాలను నమోదు చేయండి
లింగాలఘణపురం: తుపానుతో నష్టపోయిన పంటల వివరాలను త్వరగా నమోదు చేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని వనపర్తిలో నష్టం జరిగిన వరి, పత్తి, మిర్చి పంటలను జిల్లా వ్యవసాయాధికారి అంబికాసోనితో కలిసి పరిశీలించారు. నివేది క త్వరగా అందిస్తే పరిహారం అందుతుందన్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన అవసరం
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
శాఖల వారీగా నివేదిక అందించాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా


