పరిహారం ఇవ్వకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం
జనగామ: తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతీ పంటకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్ సమావేశం హాలులో కలెక్టర్ రిజ్వాన్ బాషాకు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జనగా మ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో పంటల నష్టం ఎక్కువగా ఉందన్నారు. తడిసిన పత్తితో పాటు వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలన్నారు. గతంలో బీఆర్‌ఎస్ హ యాంలో 10శాతం నష్టపోయిన రైతులకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇచ్చామని, ప్రస్తుతం మొ త్తం నష్టపోయిన కూడా రూ.10వేల పరిహారం ఇ స్తామనడం హాస్యాస్పదమన్నారు. ఉపఎన్నిక పేరి ట రౌడీలతో ఊరేగుతున్నారని ఘాటుగా విమర్శించారు. తుపానుతో ధ్వంసమైన రోడ్లను ఈజీఎస్ పథకం ద్వారా చేస్తామనడం సరికాదన్నారు. రియ ల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో ప్రభుత్వం ప్రజల బాధను అర్థం చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారివెంట పలువురు నాయకులు ఉన్నారు.
ఎమ్మెల్యే పల్లా, మాజీ మంత్రి ఎర్రబెల్లి


