రాజీ కేసులను పరిష్కరించుకోవాలి
జనగామ రూరల్: ఈనెల 15న నిర్వహించనున్న స్పెషల్ లోక్‌అదాలత్‌లో రాజీపడతగిన కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించా రు. క్రిమినల్ కేసులు ఎక్కువ మొత్తంలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సుచరిత, జూనియర్ సివిల్ జడ్జి శశి, సందీప, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ బండారి చేతన్ నితిన్, ఏసీపీలు, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ


