వరద పోటెత్తినా.. విద్యుత్ పునరుద్ధరణ
వర్షం దంచికొడుతున్నా.. రాత్రింబవళ్లు వినియోగదారులకు కరెంట్ సరఫరాను అందించారు విద్యుత్ సిబ్బంది. నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్న సమయంలో విద్యుత్ సబ్ స్టేషన్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునిగి కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. వరద నీటిలో వెళ్లి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌కు సరఫరా నిలిపివేసి ప్రత్యామ్నా య మార్గంలో విద్యుత్ సరఫరా అందించారు. వర్షం, వరద నీటిలో స్తంభం పైకి ఎక్కుతుంటే.. కాళ్లు పట్టు కోల్పోతున్నా.. విద్యుత్ సిబ్బంది తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు.


