
ఆయిల్‌పామ్ సాగుపై రైతుల ఆసక్తి
లింగాలఘణపురం: జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారని, వచ్చే మూడేళ్లలో ఎక్కువ విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం మండలంలోని నెల్లుట్లలో చిట్ల జ్ఞానేందర్‌రెడ్డికి చెందిన 12 ఎకరాల భూమిలో మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యానవనశాఖ, వ్యవసాయశాఖ, ఆయిల్‌ఫెడ్ సహకారంతో మూడేళ్లుగా 6,500 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 3,500 ఎకరాలను లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే 734 ఎకరాలను సాగు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఆయిల్‌పామ్ సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని, జిల్లాలో 40 ఎకరాల్లో నర్సరీ ఏర్పాటు, కార్యకలాపాల నిర్వహణకు భవ నం మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యా న శాఖ అధికారి శ్రీధర్‌రావు, డీఏఓ రామరావునాయక్, ఆయిల్‌ఫెడ్ జిల్లా మేనేజర్ శంకర్, ఏఓ వెంకటేశ్వర్లు, రైతులు వంచ మనోహర్‌రెడ్డి, చిట్ల ఉపేందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.
అర్హులకు పింఛన్లు అందించాలి
జనగామ రూరల్: అర్హులందరికీ పింఛన్లు అందా లని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువా రం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో అన్ని మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్లు, పోస్టల్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది, టెక్నికల్ స్టాఫ్, ఎన్‌ఎఫ్‌బీఎస్ సిబ్బందికి చేయూత పింఛన్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్స్ స్కీం అమల్లో జిల్లాను ముందంజలో నిలబెట్టాలన్నారు. అర్హుల వివరాలను పోర్టల్‌లో స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద 769 మంది అర్హులైన లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వానికి పంపగా.. అందులో 576 మందికి రూ.20,000 చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. సెర్ప్ పెన్షన్ విభాగం డైరెక్టర్ గోపాల్ రావు వివిధ రకాల పింఛన్ అర్హతలో సాంకేతిక సమస్యలు స్పౌజ్, డార్మెంట్ అకౌంట్స్, శాశ్వత వలస తదితర అంశాలపై జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు చేయాల్సిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, డీఆర్డీఓ వసంత, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
ఉపాద్యాయుల ధ్రువపత్రాల పరిశీలన
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ పాఠశాలలో గెజిటెడ్ హెడ్ మాస్టర్ పదోన్నతుల కోసం జరుగుతున్న ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రక్రియ వివరాలు విద్యాశాఖాధికారి భోజన్న ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓపెన్ స్కూల్‌కి సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికను విడుదల చేశారు. కార్యక్రమంలో స్టేట్ కోర్డినేటర్ మాధవి, ఉల్లాస్, టాస్ ఇన్‌చార్జ్ శంకర్ రావు, జిల్లా పరీక్షల సెక్రెటరీ చంద్రభాన్, రవి, నాగరాజు పాల్గొన్నారు.
ప్రతీ నియోజకవర్గంలో ఆయిల్‌పామ్ సేకరణ కేంద్రం
40 ఎకరాల్లో నర్సరీ, జిల్లా కేంద్రంలో మానిటరింగ్‌కు భవనం
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా