
ఆడపిల్ల కోసమని ఐదుగురిని కన్నా
దేవరుప్పుల: ఇంటికి ఆడపిల్ల కావాలని ఐదుగురురు కొడుకుల్ని కన్నాను. ఐదుగురు కొడుకులు పుట్టినంక వేరుపడేస్తే అర ఎకరం వ్యవసాయంతో సంసారం మొదలైంది. నా భర్త, నేను కూలీ చేసుకుంటూ పిల్లలను పెంచాం. నలుగురు కొడుకుల్ని జీతాలు ఉంచాం. చెప్పిన పని చేసిండ్రు. అందరి పెళ్లిల్లు చేసి మనిషికి ఎనిమిది ఎకరాల జాగ అప్పజెప్పినం. ఇప్పుడు పెద్దోడికి ముగ్గురు పిల్లలు కాగా మిగితా వారికి ఇద్దరు చొప్పున పిల్లలు ఉన్నరు. పదకొండు మంది (మనవళ్లు, మనవరాళ్లు)లో ఏడుగురి పెండ్లిళ్లు చూసిన, ఇంక నలుగురి పెళ్లి చూస్తే ఈ జన్మకు ఇక చాలు. నా కొడుకులు ఐతే మంచిగా బతుకుతుండ్రు. ఏ ఇంట్లో కార్యమైన కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు, కొత్త ఇయ్యం అందుకున్న చుట్టాలు కలిస్తే పెండ్లంత సందడి. వామ్మో ఇప్పుడు ఒక్కరిద్దరు చాలని ఆపరేషన్ చేసుకుంటుండ్రు. ఐనా ఎనుకటి పిల్లలకు ఇది కావాలి, అది కావాలనే స్వార్థంలేదు. ఇప్పుడు పుట్టగానే బాయిలర్ కోళ్లలాగా సాదుతుండ్రు. అయ్య, అవ్వ ఆస్తిని ఆక్రమించుకోవాలనే చూస్తుండ్రు.
– తోటకూరి సోమనర్సమ్మ, దేవరుప్పుల