
బ్యాంకర్లు చిత్తశుద్ధితో పనిచేయాలి
జనగామ రూరల్: బ్యాంకులు వచ్చే ఏడాదికి పూర్తి లక్ష్యాలు సాధించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌తో కలిసి బ్యాంకు మేనేజర్లు, బ్యాంకు కంట్రోలర్స్‌తో బ్యాంకు రుణాల వివరాలు, బ్యాంకు లింకేజీ ప్రభుత్వ పథకాలపై డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశం నిర్వహించారు. 2025–26 వార్షిక సంవత్సరానికి రూ.5,381.87 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రైతులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ వసంత, ఎల్‌డీఎం మూర్తి, ఆర్‌బీఐ ఏజీఎం చేతన్, అధికారులు పాల్గొన్నారు.
పథకాలను విస్తృత ప్రచారం చేయాలి
ఇందిరా మహిళా శక్తి పథకాలను విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ఇందిర మహిళా శక్తి పథకాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన వాహనాన్ని డీఆర్‌డీఓ వసంత ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.
సర్వే అధికారులకు పరీక్షలు నిర్వహిస్తాం
గ్రామపాలన, సర్వే అధికారులకు పరీక్షలు నిర్వహిస్తామని సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీసీలో మాట్లాడారు. ఈ నెల 27న జీపీ, సర్వే అధికారులకు పరీక్షలు నిర్వహిస్తామని, అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.
లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా రాణించాలి
సర్వేయర్లు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది సర్వేయర్లుగా రాణించాలని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ అ న్నారు. బుధవారం క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న సర్వేయర్ల శిక్షణ శిబిరాన్ని ఏడీ సర్వే అండ్ ల్యాండ్ కార్డ్స్ మన్యంకొండ, ఆర్డీఓ గో పిరామ్‌తో కలిసి పరిశీలించారు. సర్వేయర్లుగా రా ణించినప్పుడే వృత్తికి గౌరవం లభిస్తుందన్నారు.
రూ.5,381.87కోట్లతో
వార్షిక రుణ ప్రణాళిక
కలెక్టర్ రిజ్వాన్ బాషా