
ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిఽ ధిలోని చాగల్లులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను హౌసింగ్ పీడీ మాతృసింగ్‌తో కలిసి బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి నిర్మాణం పనితీరు గురించి, ఇసుక, సిమెంట్, కంకర ఎక్కడ నుంచి తెచ్చారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణాలకు సరిపోను ఇసుక మండలంలోని కొత్తపల్లి, తాటికొండ రీచ్‌లో సమృద్ధిగా ఉందని, ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, ఇసుక లోడింగ్, రవాణా ఖర్చులు మాత్రమే లబ్ధిదారుడు చెల్లించా ల్సి ఉంటుందన్నారు. అనంతరం స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీఓతో కలిసి సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చే ట్రేడ్ లైసెన్స్, అడ్వటైజ్‌మెంట్ హోర్డింగ్ రెంట్, ప్రాపర్టీ టాక్స్, కమర్షియల్ భవనాల రెంట్, వాటర్ టాక్స్ లక్ష్యానికి తగినట్లు వసూలు చేయాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంత రం మండలంలోని ఇప్పగూడెం జెడ్పీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అన్ని సబ్జెక్టుల్లో రాణించాలని, వార్షిక పరీక్షలో ఉత్తమ మా ర్కులు సాధించాలన్నారు. మధ్యాహ్న భోజనం, వంటగది, కూరగాయలు శుభ్రంగా ఉండాలన్నా రు. అలాగే ఇప్పగూడెం పీహెచ్‌సీని సందర్శించి రి జిస్టర్లు పరిశీలించారు. టీబీ ముక్త్‌భారత్ అభియాన్ అమలుతీరును పరిశీలించారు. హెచ్‌ఎం రఘు, డాక్టర్ ప్రణీత, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా