
కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు సరికాదు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జఫర్‌గఢ్: సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇప్పటికై న భాష మార్చుకోకపోతే ప్రజలు క్షమించరని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎంపీ కడియం కావ్యతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడి వేల కోట్ల ఆస్తులు సంపాదించింది ఎవరని ప్రశ్నించారు. ప్రభుత్వంలో పొరపాట్లు జరిగితే ఎత్తిచూపాలని, అంతేగాని మీ తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్‌రావు, వైస్ ఎంపీపీ నూకల ఐలయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.