
వైఎస్సార్‌కు ఘన నివాళి
జనగామ: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆదేశా ల మేరకు పట్టణంలోని లేబర్ అడ్డా వైఎస్‌ఆర్ విగ్రహానికి జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, మాజీ కౌ న్సిలర్లు మేడ శ్రీనివాస్, గాదెపాక రామచందర్, తోట సత్యం, జమాల్ షరీ ఫ్, గౌస్, జాఫర్ షరీఫ్ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.