
తక్కువ ఖర్చుతో నిర్మాణం..
నాడు వారసత్వ సంపదగా భూములు, ఆస్తులు ఉండేవి. నేడు గ్లోబల్ వార్మింగ్ నేపధ్యంలో మన భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, కలుషితం లేని నీరు అందించాల్సి న అవసరం ఏర్పడింది. ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టూ పచ్చదనం ఉండేలా చూసుకోవాలి. వనమహోత్సవంలో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించుకోవాలి. ప్రతీ నీటిబొట్టును ఒడిసి పట్టుకుని, భూమి లోపలకు పంపించే విధంగా తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాం. ప్రతీ ఇంటి ముందు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రుల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేశాం. భవిష్యత్‌లో గాలి, నీరు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడదు. – రిజ్వాన్ బాషా, కలెక్టర్
●