సీనియర్‌ అసిస్టెంట్‌ అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

సీనియర్‌ అసిస్టెంట్‌ అరెస్ట్‌

Published Tue, May 21 2024 9:10 AM

సీనియర్‌ అసిస్టెంట్‌ అరెస్ట్‌

రైతు ఆత్మహత్య కేసులో..

బచ్చన్నపేట: మండలంలోని పడమటికేశ్వాపూర్‌ గ్రామానికి చెందిన రైతు కొమ్మాట రఘుపతి ఆత్మహత్యకు కారణమైన రెవెన్యూ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ కొలిపాక సుమన్‌ను సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్సై కంకల సతీష్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రైతు రఘుపతికి చెందిన వ్యవసాయ భూమి పక్కనే ఉన్న మరికొంత సేద్యపు భూమిని రికార్డుల్లో ఎక్కించడానికి సీనియర్‌ అసిస్టెంట్‌ కొలిపాక సుమ న్‌, సర్వేయర్‌ రవీందర్‌ డబ్బు డిమాండ్‌ చేశారు. దాదాపు రూ.4 లక్షల వరకు అధికారులకు ముట్ట జెప్పిన రఘుపతి భూమి రికార్డులో ఎక్కకపోవడంతో అధికారులను అడుగగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో మనస్థాపం చెందిన రైతు రఘుప తి మార్చి 22న తన వ్యవసాయ బావి వద్ద ఉరి వేసుకొని మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి సర్వేయర్‌ రవీందర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అప్పటి నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌ సుమన్‌ తప్పించుకుని తిరుగుతూ పొలీసులకు చిక్కలేదు. రైతు రఘుపతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన సుమన్‌ను సోమవారం పట్టుకుని అరెస్టు చేసి అతని వద్ద రూ. 60 వేల నగదు, ఒక సెల్‌ ఫోన్‌ను సీజ్‌ చేసి కోర్టులో హాజరుపరచగా.. మెజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించారని ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement