సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారం | Sakshi
Sakshi News home page

సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారం

Published Sat, Nov 18 2023 1:46 AM

- - Sakshi

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ఐడీ ఉన్నోళ్లే

ప్రచారకర్తలు

ఓట్ల కోసం అభ్యర్థుల

వినూత్న ప్రయత్నాలు

కాజీపేటకు చెందిన అభిరామ్‌ అనేక వాట్సాప్‌ గ్రూపుల్లో సభ్యుడు. నిత్యం వాట్సాప్‌ గ్రూపులను పరిశీలిస్తూ.. అందులో వచ్చిన మెసేజ్‌లకు రిప్లై ఇస్తుంటాడు. ఇతన్ని సంప్రదించిన ఓ ప్రధానపార్టీ అభ్యర్థి ప్రచారకర్తగా నియమించుకుని నెలకు సుమారు పాతిక వేల రూపాయల వేతనం సైతం ఇస్తున్నాడు. అభిరామ్‌ చేయాల్సిందల్లా.. సదరు అభ్యర్థికి సంబంధించిన ప్రచార విషయాలు, ఫొటోలను ఆయా గ్రూపుల్లో పోస్టు చేయడం. గ్రూపుల్లో వచ్చిన ఇతర అభ్యర్థుల ప్రచారాలపై కౌంటర్‌ రిప్లై ఇవ్వడం.

వరంగల్‌కు చెందిన రఘు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఇతనికి సుమారు 2వేల మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. ఇదే ఇప్పుడు ఇతనికి ఆదాయాన్ని సమకూరుస్తుంది. అవును.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థికి సంబంధించిన ప్రచార బాధ్యతలు రఘుకు అప్పగించారు. దీంతో సదరు అభ్యర్థికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. నెలకు సుమారు రూ.20వేలకు వరకు పొందు

తున్నాడు.

ఖిలా వరంగల్‌: గతంలో ఎన్నికలు, ప్రచారం అంటే సభలు సమావేశాలతోపాటు, కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, వాల్‌ రైటింగ్స్‌.. కానీ, ప్రస్తుతం ఎన్నికల ప్ర చార తీరు పూర్తిగా మారిపోయింది. అభ్యర్థులు ఒక గ్రామానికో.. ఒక కాలనీకో వెళ్లినా ఆ విషయం మా త్రం ఇతర దేశాల్లోఉన్న ఈ నియోజకవర్గం ఓట రుకు సునాయాసంగా చేరుతోంది.. దీనికి కారణం సోషల్‌ మీడియా.. పైన చెప్పుకున్నట్లు ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా రఘు, అభిరామ్‌ వంటి సోషల్‌ మీడియా ప్రచారకర్తలు ఇప్పుడు అన్నిపార్టీలకు పనిచేస్తున్నారు. ప్రచారం హోరెత్తుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నా రు. ఇందులో సోషల్‌ మీడియా పాత్ర కీలకంగా మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయ నాయకులు ఎన్నికల్లో హైటెక్‌ టెక్నాలజీని వినియోగించుకొని తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆండ్రాయిడ్‌ ఫోన్లు అందుబాటులోకి రావడంతో వాట్సాప్‌, యూ ట్యూబ్‌, ఫేస్‌బుక్‌లతోపాటు వాయిస్‌ రికార్డ్‌ కాల్స్‌, మెసేజ్‌లను ఓటర్ల ఫోన్లకు పంపుతున్నారు. దీంతో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు లక్షల్లో డిమాండ్‌ పెరిగింది. ఇలాంటి వారితో వివిధ పార్టీల అభ్యర్థులు, ఆశావహులు స్పందింపులు జరుపుతున్నారు. ప్రచార ఫొటోలతోపాటు వారికి అనుకూలంగా ఉండే పోస్టులు పెట్టాలని బేరసారాలకు దిగుతున్నారు. ప్రతి పోస్టుకు ఇంత అని లెక్కకట్టి ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. సొంత పార్టీ హామీలు, ప్రత్యర్థుల ఆరోపణలు తిప్పికొట్టేలా చేపడుతున్న ప్రచార పర్వానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు రూపొందించి ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో షేర్‌ చేయడం వీరి పని. ఇందుకుగాను ఏజెన్సీలు, యూట్యూబ్‌ చానళ్ల నిర్వహకులతో ఒప్పందం కుదుర్చుకొని ప్యూహకర్తలకు రూ.లక్షల్లో చెల్లిస్తున్నట్లు సమాచారం.

చూడలేక.. చదవలేక..

ఇదంతా బాగానే ఉన్నా.. ఎన్నికల వేళ సాంకేతిక పరిజ్ఞానం మితిమీరిపోతోంది. ముఖ్యంగా వాట్సాప్‌ గ్రూపుల ద్వారా చేస్తున్న ప్రచారం సగటు ఓటర్లను ఇబ్బంది పెడుతోంది. ఫొటోలు, వీడియోలు, సమావేశ సమాచారాన్ని ఒకేసారి గ్రూపులో ఎక్కువ సంఖ్యలో పోస్టు చేస్తుండటం ఓటర్లకు విసుగు తెప్పిస్తోంది. నియోజకవర్గాల స్థాయిలో ప్రధాన పార్టీ నాయకులు వారికి తెలిసిన నంబర్లతో గ్రూపులు ఏర్పాటు చేశారు. తమ గ్రూపులో ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవడానికి వారి వద్ద ఉన్న నంబర్లన్నీ కలుపుతున్నారు. ఏదైన పార్టీకి చెందిన వాట్సాప్‌ గ్రూపులో ఓ వ్యక్తిని యాడ్‌ చేస్తే ఇష్టం ఉన్నా.. లేకున్నా మొహమాటంతో పోస్టులను చూస్తున్నారు. మరికొంత మంది పోస్టులను చూడలేక, చదవలేక సతమతమవుతున్నారు. పొరపాటున ఎగ్జిట్‌ అయితే పార్టీ మనిషి కాదని భావించే అవకాశం ఉందని అనేకమంది గమ్మున ఉంటున్నారు. ఒకే గ్రూపులో పార్టీకి అనుకూలంగా.. వ్యతిరేకంగా పోస్టులు వస్తుండడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.

వాయిస్‌కాల్స్‌ హోరు

ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు

కాజీపేట: అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అభ్యర్థులు వాయిస్‌ మెయిల్‌ కాల్స్‌ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ‘నేడు ఫలానా పార్టీ అభ్యర్థిని.. మీ ఓటు మా పార్టీ గుర్తుకే వేసి గెలిపిస్తే.. మన ప్రాంతంలోని సమస్యలు పరిష్కరిస్తా.. అంటూ వాయిస్‌ కాల్‌ను నియోజకవర్గంలోని ఓటర్ల ఫోన్‌లకు ప్రతిరోజూ పంపిస్తూ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు సోషల్‌ మీడియా వేదికగా పోటీలోఅభ్యర్థులు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఏ వాట్సాప్‌ గ్రూపు చూసినా.. ఏ ఫేస్‌ బుక్‌ పేజీ ఓపెన్‌ చేసినా ఏదో ఒక అభ్యర్థి ప్రచార చిత్రాలు, వీడియోలే దర్శనమిస్తుండడం గమనార్హం.

Advertisement
 
Advertisement
 
Advertisement