జనగామలో రౌడీల రాజ్యం రానివ్వం | Sakshi
Sakshi News home page

జనగామలో రౌడీల రాజ్యం రానివ్వం

Published Sat, Nov 18 2023 1:46 AM

జనగామ: పల్లా సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన యువత  
 - Sakshi

జనగామ రూరల్‌: జనగామ చైతన్యవంతమైన గడ్డ అని రౌడీల రాజ్యం రాకుండా అభివృద్ధికి పట్టం కట్టి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కావాలని అందుకు ప్రజలు ఆశ్వీదించాలని బీఆర్‌ఎస్‌ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వడ్లకొండ, పెద్దపహాడ్‌, గోపిరాజుపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వండ్లకొండలో విలేకరులతో వారు మాట్లాడుతూ ఈ గ్రామం చైతన్యవంతమైందని కమ్యూనిస్టు పోరాటాలు నడిచాయని గ్రామాల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ వైపు కదులుతున్నారన్నారు. మండలంలో 50 వేల మోజార్టీ వస్తుందనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి మాటలకు ఎవరూ వినడం లేదని జోకర్‌ బ్రోకర్‌ను ప్రజలు విశ్వసించరని అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి డీలాపడ్డాడని, తాను వ్యక్తిగత విమర్శలు చేయనని జనగామకు ఏం చేస్తానో చెబుతానన్నారు. తాను స్థానికుడిని కాదని చెబుతున్నారని.. నాది పక్క తరిగొప్పుల మండలం సోడాషపల్లి అని గెలిచిన తర్వాత పక్కాగా జనగామలోనే ఉంటానన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, ఎంపీపీ మేకల కళింగరాజు, వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌, జెడ్పీటీసీ నిమ్మతి దీపిక మహేందర్‌రెడ్డి, బక్క నాగరాజు , మండల శ్రీరాములు, మండల పార్టీ అధ్యక్షుడు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

జనగామ ప్రజలకు ‘పల్లా’ సేవలు

జనగామ: జనగామ ప్రజల కష్టసుఖాల్లో పలుపంచుకోబోతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లో స్థాపించిన నీలిమ ఆస్పత్రిలో ఈ ప్రాంత ప్రజలకు పూర్తివైద్యం ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకున్నాడని ఆయన సతీమణి నీలిమ అన్నారు. శుక్రవారం ఆమె పట్టణంలోని ఆయా వార్డుల్లో బక్కా నాగరాజు, మల్లవరపు దివ్య, చెంచారపు పల్లవితో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. జనగామ నియోజకవర్గ ప్రజలకు నీలిమ హాస్పిటల్‌లో ఉచిత వైద్య సదుపాయాలను అందించేందుకు ముందుకు వచ్చారన్నారు.

‘పలా’్ల సమక్షంలో యువత చేరిక

పట్టణంలోని 4, 5 వార్డులకు చెందిన సుమారు 250 మంది యువకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పల్లా గులాబీ కండువా కప్పి స్వాగతించారు. ఉద్యోగులు, టీచర్ల, వీఆర్‌ఏలు, ఉద్యోగుల పీఆర్సీ పెంపు, జౌట్‌ సోర్సింగ్‌, ఉద్యోగాల కల్పన, ఆశ వర్కర్లు, ఉద్యోగుల జీతాలపెంపు విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

కారుదే విజయం.. కేసీఆరే ముఖ్యమంత్రి

నర్మెట: ఎన్నికల్లో కారుదే విజయమని, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరేనని ఎమ్మెల్యే, నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి శుక్రవారం ప్రచారం నిర్వహించిన ఆయన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను, వ్యాపారస్తులను కోరారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో స్టెతస్కోప్‌తో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఆయన వెంట రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగరావు, ఇమ్మడి శ్రీనివాస్‌ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చింతకింది సురేష్‌, ఉమ్మడి మండలాల కన్వీనర్‌ పెద్ది రాజిరెడ్డి, కోఆర్డినేటర్‌ నీరటి సుధాకర్‌, ఎంపీపీ తేజావత్‌ గోవర్ధన్‌, జెడ్పీటీసీ మాలోత్‌ శ్రీనివాస్‌, రామిని శివరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ శ్రేణుల ప్రచారం..

తరిగొప్పుల: పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు శుక్రవారం మండలకేంద్రంలో ప్రచారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు గడపగడపకు వెళ్లి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించా రు. దామెర ప్రభుదాస్‌, చిలువేరు లింగం, అంకం రాజారాం, చెన్నూరి సంజీవ పాల్గొన్నారు.

అభివృద్ధి చేసే నాయకుడిని ఆదరించాలి

బచ్చన్నపేట : అభివృద్ధి చేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఆదరించాలని బచ్చన్నపేట సర్పంచ్‌ వడ్డెపల్లి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పలు వార్డుల్లో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. మన సంక్షేమ పథకాలు అలాగే కొనసాగాలంటే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పలువురు పాల్గొన్నారు.

నాన్నకు తోడుగా.. మీ ఓటు అండగా..

చేర్యాల(సిద్దిపేట): ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతుగా ఆయన కుమారుడు పల్లా అనురాగ్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో ముచ్చటించారు. నాన్నకు తో డుగా వచ్చా, మీరు ఓటు వేసి నాన్నకు అండగా నిలవాలని, కారు గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశాడు. ఆయన వెంట సర్పంచ్‌ ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు, రాష్ట్ర నాయకుడు ఏకానందం తదితరులున్నారు.

బీఆర్‌ఎస్‌లో భారీ చేరికలు

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసల జోరు పెరిగింది. శుక్రవారంచేర్యాల పట్టణ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పార్టీలో చేరారు. వారికి జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కాంగ్రెస్‌ పా ర్టీ మండల అధ్యక్షుడు, చుంచనకోట సర్పంచ్‌ ఆది శ్రీనివాస్‌ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు పొ న్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు పొన్నాల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అంకుగారి స్వరూపరాణి, కౌన్సిలర్‌ ఆడెపు నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

జనగామ చైతన్యవంతమైన గడ్డ

రేవంత్‌ రెడ్డి మాటలు ఎవరూ నమ్మరు

అభివృద్దికి పట్టం కట్టాలి

బీఆర్‌ఎస్‌ జనగామ అభ్యర్థి రాజేశ్వర్‌రెడ్డి

జనగామ రూరల్‌ : వడ్లకొండలో ప్రచారం చేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి
1/3

జనగామ రూరల్‌ : వడ్లకొండలో ప్రచారం చేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి

2/3

జనగామ: జనగామలో ప్రచారంలో పాల్గొన్న పల్లా సతీమణి నీలిమ
3/3

జనగామ: జనగామలో ప్రచారంలో పాల్గొన్న పల్లా సతీమణి నీలిమ

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement