రివిజన్ సమర్థవంతంగా చేపట్టాలి
జగిత్యాల: స్పెషల్ ఇంటెన్సి వ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రా ష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శని వారం జిల్లా కలెక్టర్‌తో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2002 ఎలక్టోరోల్ జాబితాలో 2025 ఎలక్టోరోల్ మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించామ ని, కేట గిరి–ఏలో 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరోల్ జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ బిలో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబి తాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ–సీలో 198 8 నుంచి 2002 మధ్య జన్మించి 2025 ఓటరు జాబి తాలో నమోదు కాబడిన వారు, కేటగిరి–డీలో 2002–2007 మధ్య జన్మించిన వారి గా కేటాయించినట్లు తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ బీఎల్వోలు, సూపర్‌వైజర్ల ద్వారా కేటగి రి–ఏ ఓట రు జాబితాను బీఎల్వో యాప్ ద్వారా నిర్ధారించి కేటగిరి–సీ, డీలను కేటగిరిఏకు అనుసంధానం చేశామన్నారు. పొరపాట్లు లేకుండా చర్యలు తీసకుంటున్నామన్నారు. అదనపు కలెక్టర్ రాజా గౌడ్, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు పాల్గొన్నారు.


