ఊరూ.. పల్లెటూరు!
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన శ్రీనివాస్ ఉపాధిరీత్యా 30 ఏళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఇటీవల దసరా పండక్కి సొంతూరికి వచ్చాడు. ఊళ్లో బస్సు దిగి ఇంటికి వెళ్తున్న ఆయన్ను దారి పొడవునా పలకరించారు. ‘ఎప్పుడొచ్చావురా అల్లుడూ’ అని ఓ పెద్దాయన అంటే.. ‘ఇదే రాకటనా పిల్లల్ని తీసుక రాలేదా’ అని మరో పెద్దమ్మ.. ‘బావ ఎప్పుడొచ్చావు’ అంటూ ఓ స్నేహితుడు.. ‘అన్నా ఇప్పుడే వస్తున్నావా’ అంటూ ఓ యువకుడు పలకరించాడు. మామా, కాకా, బిడ్డా అంటూ వరుసలు పెట్టి పిలిచే సంస్కృతి ఇప్పటికీ చాలా పల్లెల్లో కనిపిస్తోంది. ఆత్మీయతను పంచుతోంది.
ఊరూ పల్లెటూరు.. దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి.. కొడుకుకిచ్చె ప్రేమ వేరు
కండ్ల ముందే ఎదుగుతున్న..
సంబరాల పంటపైరు అంటూ..
ఓ సినీకవి రాసిన విధంగా ఆధునిక ప్రపంచం ఆవహిస్తున్నా.. ఉపాధి కోసం బయట బతుకున్నా ఎందరికో కన్న ఊరు అంటే ఎంతో ఇష్టం.. ఎక్కడ ఉన్నా.. పుట్టిన గ్రామం అంటే.. తల్లి ప్రేమను చూపినట్లవుతోంది. అంతేకాదు.. పుట్టిన ఊరిని వదిలి పొట్టకూటికోసం పట్టణాలు.. దేశ, విదేశాల్లో బతుకుతున్న యువత స్వగ్రామం ముచ్చట్లు అంటే ఎంతో ఇష్టపడుతున్నారు. ఊరిపై ప్రేమనూ ఒలకబోస్తున్నారు. జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. గ్రామాల్లో ఉన్నవారు సైతం బంధాలను కలుపుకుంటున్నారు. కష్టసుఖాల్లో తోడునీడగా నిలుస్తూ పల్లెల్లో ఐక్యత భావాన్ని ఇప్పటికీ చాటుతున్నారు. సాగు పనుల్లో సాయంగా నిలుస్తున్నారు. ఎక్కడ ఎదురైనా వరుసపెట్టి పిలుస్తూ.. తోబుట్టువులుగా మెదులుతున్నారు. తరాలు మారుతున్నా.. తరగని ప్రేమను పంచుతున్న పల్లె అనురాగాలపై సండేస్పెషల్..!!
– వివరాలు 8లోu
– హుజూరాబాద్
ఊరూ.. పల్లెటూరు!


