లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి
ధర్మపురి: ఈనెల 15న నిర్వహించనున్న స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్విని యోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి యోగి జానకీ తెలిపారు. స్థానిక కోర్టు కార్యాలయంలో శనివారం లోక్ అదాలత్‌పై న్యాయవాదులు, పోలీసులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కక్షిదారులకు ఇదొక సువర్ణ అవకాశమని కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. సివిల్ కేసులు, వివాహ సంబంధమైన కేసులు, మోటార్ ప్రమాద క్లెయిమ్‌లు, చెక్‌బౌన్స్ కేసులు ఇతర రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు దమ్మెర శ్రీనివాస్, రౌతు రాజేశ్, జాజాల రమేశ్, కలమడుగు కీర్తి, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.
అంజన్న సన్నిధిలో జిల్లా న్యాయమూర్తి పూజలు
మల్యాల: కొండగట్టు అంజన్న సన్నిధిలో జిల్లా మొదటి అడిషన్ సెషన్స్ జడ్జి ఎస్.నారాయణ ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారికి పూజల అనంతరం తీర్థ, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఈవో శ్రీకాంత్‌రావు, ఆలయ ఉప ప్ర ధాన అర్చకులు చిరంజీవ స్వామి, స్థా నాచా ర్యులు కపీందర్, ఆలయ ఇన్స్‌పెక్టర్ ఉమామహేశ్వరరావు, ఏఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.
గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి
గొల్లపల్లి/రాయికల్: పశువుల గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరేశ్, జిల్లా పశువైద్యాధికారి ప్రకాశ్ అన్నారు. గొల్లపల్లి మండలం వెంగలాపూర్‌లో నరేశ్ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. గ్రామంలో 300కు పైగా పశువులకు టీకాలు వేశారు. రాయికల్ మండలం అల్లీపూర్‌లో ప్రకాశ్ టీకాల పంపిణీని పరిశీలించారు. టీకాల ద్వారా పాడి పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమాల్లో రాయికల్ మండల అదనపు పశువైద్యాధికారి నరేశ్‌రెడ్డి, లైవ్‌స్టాక్ అసిస్టెంట్లు ఎలిగేటి రవీందర్, నాగేందర్‌రెడ్డి, శివకుమార్, కార్యాలయ సహాయకులు షేక్ అహ్మద్, పోచయ్య, గొల్లపల్లి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవీందర్, సిబ్బంది రవీందర్, రాజశ్రీ, రవి, శ్రీకాంత్, నిశాంత్, రమేశ్, నర్సయ్య పాల్గొన్నారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం
మెట్‌పల్లి: భారత రక్షణ దళాలపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద శనివారం బీజేపీ నాయకులు ఆయన దిష్టిబొమ్మను దహ నం చేశారు. పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్ మాట్లాడుతూ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నాయకులు కుడుకల రఘు, సుంకే ట విజయ్, తోకల సత్యనారాయణ, జుంగుల అనిల్, దొ నికెల నవీన్, లోలపు అనిల్ తదితరులున్నారు.
ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం
కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలకు కేంద్రం యూఐడీఎఫ్ కింద రూ.37.40కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ.. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ప్రధాని మోదీ, ఎంపీ అర్వింద్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నిధులను తాము మంజూరు చేయించినట్లు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు.
లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి
లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి


