
అన్ని మారిపోతున్నాయి
మన సంప్రదాయలు ఇప్పుడు కనిపించడం లేదు. అన్ని మారిపోతున్నాయి. మగ్గం బట్టలు పోయి మిల్లు బట్టలు వచ్చాయి. అప్పటి దోతి, పంచె కుట్టు, బనీయన్‌లు ఇప్పుడు కానరావడం లేదు. నేను మాత్రం మా తాత, నాయిన పద్ధతిలోనే నడుచుకుంటున్న.
– కనుమల్ల రామస్వామి, నేత కార్మికుడు, వెదిర
గోచీ పెట్టుకోవడమే అలవాటు
చిన్నప్పుడు గౌను, లంగాజాకెట్ వేసుకునేదాన్ని. వయస్సు వచ్చాక లంగా, జాకెట్ ఓనీ, తర్వాత గోచిచీర కట్టుకుంటున్న. ఇప్పటి పిల్లలకు గోచిపెట్టుకోవడం నామోషీగా అనుకుంటారు. కానీ అదే మన పాతకాలం పద్ధతి. చీర కంటే గోచి చీర కట్టుకుంటే బాగుంటుంది.
– కనకమ్మ, వ్యవసాయదారు, కరీంనగర్
నిండుగా ఉంటుంది
పాత పద్ధతిలో ఆరుగజాల చీర కట్టుకుంటే నిండుగా ముతైదువ తనం ఉట్టిపడుతుంది. ఇప్పుడు ఎవరూ పాత పద్ధతులు పాటించడంలేదు. ఇంకా ముసలివాళ్లు మాత్రమే గోచిచీర కట్టుకుంటున్నారు. – ఓదెమ్మ, వ్యవసాయదారు,
రైతుబజార్, కరీంనగర్

అన్ని మారిపోతున్నాయి

అన్ని మారిపోతున్నాయి