
ఉరేసుకుని హిజ్రా ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని తులసీనగర్‌లో నివాసముండే తి రుమందాస్ మహేంద్ర అలియాస్ అన్విక (25) అనే హిజ్రా శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అన్విక కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకున్నా నయం కాలేదు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. పట్టణ ఎస్సై కుమారస్వామి సంఘటన స్థలానికి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డీఎస్పీ మహేశ్ అంత్యక్రియలు పూర్తి
కరీంనగర్‌క్రైం: డీఎస్పీ మహేశ్ అంత్యక్రియలు శనివా రం కరీంనగర్‌లోని సప్తగిరికాలనీ శ్మశానవాటికలో పూర్తయ్యాయి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అంత్యక్రియల్లో పాల్గొని, మహేశ్ పార్థీవదేహంపై పూలమాల వేసి నివాళి అర్పించారు. అడిషనల్ డీసీపీ (అడ్మిన్) వెంకటరమణ, అడిషనల్ డీసీపీ ఏఆర్ భీంరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేట శివా రులో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. జీఆర్‌పీ ఎస్సై మహేందర్ కథనం ప్రకా రం.. శుక్రవారం రాత్రి సమయంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి (58) తలకు తీవ్ర గాయమై.. కాలు విరిగి అ క్కడికక్కడే మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ సంపత్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఒంటిపై నలుపు రంగు ప్యాంటు, నీలి రంగు గడుల షర్ట్ ఉందని, సమాచారం తెలిసిన వారు 83285 12176, 97011 12343 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలో వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గోపాలరావుపల్లికి చెందిన కడారి జ్యోతిరెడ్డి(35) అనారోగ్యంతో బాధపడుతూ మనస్థాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్త మల్లారెడ్డి, కూతురు ఉన్నారు. మండలంలోని పద్మనగర్‌కు చెందిన వృద్ధుడు కుడిక్యాల సిద్ధిరాములు(73) ఒంటరితనం భరించలేక ఉరివేసుకున్నాడు. వృద్ధుడి భార్య పది నెలల క్రితం మరణించింది. తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిపై బెంగతో వ్యక్తి ఆత్మహత్య
ధర్మపురి: తల్లి చనిపోవడంతో ఒంటరితనం భరించలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన కొమురెల్లి నరేష్ (34)కు ఇంకా పెళ్లి కా లేదు. తల్లి ఎనిమిది నెలల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి నరేష్ ఒంటరివాడయ్యాడు. శనివారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. స్థానికులు గమనించి నరేశ్ సోదరి మంజులకు సమాచారం అందించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఉరేసుకుని హిజ్రా ఆత్మహత్య

ఉరేసుకుని హిజ్రా ఆత్మహత్య

ఉరేసుకుని హిజ్రా ఆత్మహత్య

ఉరేసుకుని హిజ్రా ఆత్మహత్య