దుర్వాసన భరించలేకున్నాం | - | Sakshi
Sakshi News home page

దుర్వాసన భరించలేకున్నాం

Jul 10 2025 6:45 AM | Updated on Jul 10 2025 6:45 AM

దుర్వ

దుర్వాసన భరించలేకున్నాం

దుర్వాసన భరించలేకపోతున్నాం. మేం ఇక్కడ కొన్నేళ్లుగా బుక్‌స్టాల్‌ నిర్వహిస్తున్నాం. ప్రారంభంలో చాలా మంది వచ్చారు. ఇప్పుడు దుర్గంధం కారణంగా ఎవరూ రావడం లేదు. దోమలు విపరీతంగా ఉంటున్నాయి. అధికారులు స్పందించి మురికికాలువ నీరు బయటకు వెళ్లేలా చూడాలి.

– నాగేంద్రప్రసాద్‌, జగిత్యాల

టైలరింగ్‌ నడుస్తలేదు

నేను టైలరింగ్‌ చేసుకుంటాను. డ్రైనేజీ పక్కనే నా షాపు ఉంది. మురికినీరు షాపులోకే రావడంతో టైలరింగ్‌ చేసుకోలేకపోతున్నాను. దోమలతోపాటు.. దుర్గంధం రావడంతో షాపులో గంటసేపు కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.

– లక్ష్మణ్‌, జగిత్యాల

చర్యలు తీసుకుంటున్నాం

సమస్య మా దృష్టికి వచ్చిన రెండు రోజుల్లోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. డ్రైనేజీ బ్లాక్‌ కావడంతో నీరు ఎటూ వెళ్లడం లేదు. ఈ సమస్యను ఇటీవలే స్థానికులు మా దృష్టికి తీసుకొచ్చారు. మురికినీరు వెళ్లేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటాం.

– స్పందన, మున్సిపల్‌ కమిషనర్‌

దుర్వాసన భరించలేకున్నాం
1
1/2

దుర్వాసన భరించలేకున్నాం

దుర్వాసన భరించలేకున్నాం
2
2/2

దుర్వాసన భరించలేకున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement