నృసింహుడి సన్నిధిలో పోటెత్తిన భక్తులు | Sakshi
Sakshi News home page

నృసింహుడి సన్నిధిలో పోటెత్తిన భక్తులు

Published Sun, Dec 3 2023 12:52 AM

ధర్మపురి దేవస్థానంలో    దైవదర్శనం కోసం భక్తుల క్యూలైను - Sakshi

ధర్మపురి: కార్తీకమాసం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ దేవాలయాల్లో స్వామివారలను దర్శించుకున్నారు.

నేడు మద్యం దుకాణాలు బంద్‌

జగిత్యాలక్రైం: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో జిల్లాలోని మద్యం దుకాణాలను ఆదివారం మూసివేయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ పి.శ్రీధర్‌ తెలిపారు. మద్యంషాపులు, బార్‌అండ్‌ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు కూడా మూసివేయిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

పౌలస్తేశ్వరస్వామికి జెడ్పీ చైర్‌పర్సన్‌ పూజలు

జగిత్యాలరూరల్‌: కార్తీకమాసం సందర్భంగా జగిత్యాలరూరల్‌ మండలం పొలాస గ్రామంలోని శ్రీపౌలస్తేశ్వరస్వామి ఆలయంలో జెడ్పీచైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్యే సతీమణి రాధిక శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

మరమ్మతుపై నిర్లక్ష్యం

మెట్‌పల్లి: ఇది మెట్‌పల్లి మినీ స్టేడియంలోని ఓపెన్‌ జిమ్‌. ఇందులోని ప్లాట్‌ఫామ్‌పై ఉన్న టైల్స్‌ ఎక్కడికక్కడ ఊడిపోతున్నాయి. కొన్ని పరికరాలు సరిగ్గా పని చేయడం లేదు. మండల పరిషత్‌ పార్కులో ఉన్న ఓపెన్‌ జిమ్‌లో లైట్లు లేవు. అక్కడకు వచ్చే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి మరమ్మతు చేపట్టి లైట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

జాతీయస్థాయి డాడ్జ్‌ బాల్‌ పోటీలకు తాటిపల్లి విద్యార్థులు

మల్యాల: మండలంలోని తాటిపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి దానే నరేశ్‌తోపాటు, పాఠశాల పూర్వ విద్యార్థి అలువాల వెంకటేశ్‌ జాతీయ స్థాయి డాడ్జ్‌ బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్‌కాలనీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి డాడ్జ్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి సాయంత్రం 7 వరకు హర్యానాలో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గౌతమకృష్ణరావు, పీఈటీ బీరయ్య తెలిపారు.

రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలకు పూడూర్‌ విద్యార్థులు

కొండగట్టు(చొప్పదండి): కొడిమ్యాల మండలం పూడూర్‌ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న ఇరుమల్ల అరవింద్‌ ఎస్జీఎఫ్‌ రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌రాజు తెలిపారు. గతనెల పెద్దపల్లిలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరి ఈనెల 5న జోగులాంబగద్వాల జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరుకానున్నట్లు తెలిపారు. అరవింద్‌ను పీడీ లక్ష్మీరామ్‌నాయక్‌, సర్పంచ్‌ కవిత, టీచర్లు అభినందించారు.

పూజల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే సతీమణి
1/4

పూజల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే సతీమణి

జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులు
2/4

జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులు

వృథాగా పడి ఉన్న పరికరాలు
3/4

వృథాగా పడి ఉన్న పరికరాలు

అరవింద్‌
4/4

అరవింద్‌

Advertisement
Advertisement