Who Is Wali Canadian: ఉక్రెయిన్‌కు అండగా మోడ్రన్‌ బాహుబలి.. ఇప్పటికే ఆరుగుర్ని చంపేశాడు..

Worlds Best Snipers Wali Join Ukrainian Forces  - Sakshi

Wali’, arrived in war-torn Ukraine: అతను రంగంలోకి దిగితే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. నింగి, నేల.. లక్ష్యం ఏదైనా గురి తప్పకుండా కూల్చేయడం, కాల్చేయడం అతని ప్రత్యేకత. అలాంటి వ్యక్తి స్వచ్చందంగా యుద్ధ రంగంలోకి దిగాడు మరి. అదీ.. ఉక్రెయిన్‌కు అండగా!. ఇది రష్యా బలగాలకు దడ పుట్టిస్తోంది!. 

ప్రపంచంలోనే అత్యుత్తమ షూటర్లలో ఒకరైన వాలీ ఉక్రెయిన్‌ సైన్యంలోకి చేరాడు. రష్యా ఉక్రెయిన్‌ల మధ్య పోరాటం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో.. యుద్ధంలో దెబ్బతింటున్న ఉక్రెయిన్‌కి సాయంగా రష్యాదళాలతో పోరాడేందుకు వచ్చాడు. రాయల్‌ కెనడియన్ 22వ రెజిమెంట్‌కు చెందిన వ్యక్తి, షూటింగ్‌లో మంచి అనుభవజ్ఞుడు అయిన వాలీ ఈ వారం ప్రారంభం నుంచి ఉక్రెయిన్‌ పోరాటంలో పాల్గొన్నాడు.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు  వ్లొదిమిర్‌ జెలెన్‌ స్కీ రష్యాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో పాల్గొనండి అని విదేశీయులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వాలీ బుధవారం నుంచి ఉక్రెయిన్‌ పోరాటంలో పాల్లోన్న రెండు రోజుల్లోనే ఆరుగురు రష్యన్లను మట్టికరిపించాడు. ఈ మేరకు వాలీ మాట్లాడుతూ.. నేను వారికి సహాయం చేయాలనకుంటున్నాను. ఇక్కడ ప్రజలు యూరోపియన్‌గా ఉండాలనుకుంటున్నారు. రష్యన్లుగా ఉండాలనుకోవడం లేదు అందువల్లే వాళ్లు బాంబు దాడికి గురవుతున్నారు. వాళ్లకు నా సహాయం అవసరం అని అన్నాడు.

అయితే వాలీ యుద్ధంలో సుమారు 40 మంది నేలకూల్చగలడు. అంతేకాదు రోజుకి సగటున దాదాపు 7 నుంచి 10 మందిని మట్టి కరిపించగలడు.  ఈ 40 ఏళ్ల ఫ్రెంచ్-కెనడియన్ కంప్యూటర్ శాస్త్రవేత్త 2009 నుంచి 2011 మధ్య అఫ్గనిస్తాన్ యుద్ధంలో రెండుసార్లు పనిచేశాడు. అతను అఫ్గనిస్తాన్‌లో పనిచేసిన సమయంలో అరబిక్‌లో రక్షకుడు అని అర్థం వచ్చే  పేరును సంపాదించుకున్నాడు. అతనికి భార్య, కొడుకు ఉన్నారు. 

ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసి దేశవ్యాప్తంగా దాడులకు దిగింది. ఈ యుద్ధం భారీ శరణార్థుల సంక్షోభాన్ని ప్రేరేపించింది. అంతేకాదు ఉక్రెయిన్‌లోని అనేక వందల మంది పౌరుల మరణానికి దారితీసింది.

(చదవండి: ఉక్రెయిన్‌లో పీక్‌ స్టేజ్‌కు రష్యా వార్‌.. భయానక దృశ్యాలు ఇవే..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top