వైరల్‌: ఫుడ్‌ డెలివరి: కాపలాగా పాము..

Woman Finds Snake 'Guarding' Her Food Delivery - Sakshi

మనం ఆన్‌లైన్‌ లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయగానే ఆ సంస్థలు ఆహారాన్ని మన వద్దకు చేరుస్తాయి. ఒక్కొసారి మనం అందుబాటులో లేకపోతే... ఆ డెలివరీలను గుమ్మం వద్దే పెట్టేసి వెళతాయి సదరు సంస్థలు. ఇలా ఫుడ్‌ డెలివరీని ఒక సంస్థకు చెందిన బోయ్‌ ఇంటి  గుమ్మం వద్దే పెట్టగా అక్కడ దానికి పాము కాపలాగా ఉండటం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని అరిజోనాకు చెందిన ఒక మహిళ ఉబెర్‌ఈట్స్‌లో ఫుడ్‌ కోసం ఆర్డర్‌ పెట్టింది. డెలీవరి బాయ్‌ వచ్చి ఫుడ్‌ఆర్డర్‌ను ఇంటి బయట పెట్టేసి వెళ్లాడు..దాన్ని తీసుకుందామని వెళ్ళిన మహిళ ఒక్కసారి షాక్‌కు గురయ్యింది...కాసేపటికి తెరుకుని  ఫుడ్‌ డెలివరి కవర్‌ పక్కన ఒక పాముని గమనించింది.

అది భయంకరమైన  వెస్ట్రర్న్‌ డైమండ్‌ రాటిల్‌స్నేక్‌. ఇది అత్యంత విషపూరితమైనది. ఇవి ప్రధానంగా యూనైటేడ్‌ స్టేట్స్, మెక్సికోలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పాము కాటుకి గురై ఇప్పటికే మెక్సికోలో​ చాలా మంది బలయ్యారు . కాసేపటికి తెరుకొని ఆమె పాములను పట్టుకునే సంస్థకు ఫోన్‌ చేసింది. రాటిల్‌ స్నేక్‌ సొల్యూషన్‌, రీలోకేషన్‌ వారు వచ్చి ఆపామును పట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్నిఫోటోలను స్నేక్‌ రీలోకేషన్‌ వారు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది  వైరల్‌ అవుతొంది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top