ట్రంప్‌ కుమారుడికి అనుమానాస్పద లేఖ.. ఏముందంటే

White Powder Letter To Donald Trump Junior - Sakshi

ఫ్లోరిడా: అమెరికాలో మళ్లీ తెల్ల పౌడర్‌  కలకలం రేగింది. దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌కు ఒక అనుమానాస్పద లేఖ వచ్చింది. ఈ లెటర్‌ను ఆయన ఓపెన్‌ చేయగా అందులో తెల్ల పొడి కనిపించింది. జూనియర్‌ ట్రంప్‌ ఫ్లోరిడా నివాసానికి ఈ లెటర్‌ వచ్చింది.

అయితే ఈ తెల్ల పౌడర్‌ ఏంటన్నదానిపై క్లారిటీ రాలేదు. ఈ పౌడర్‌ ఏంటన్నదానిపై క్లారిటీ లేకపోయినప్పటికీ ఇది అంత ప్రమాదకరం కాదన్నది మాత్రం టెస్టుల్లో తేలింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం జూనియర్‌ ట్రంప్‌ తన తండ్రి తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. 2018లో కూడా జూనియర్‌ ట్రంప్‌నకు ఇలాంటి తెల్ల పౌడర్‌ ఉన్న ఒక లేఖ రావడం గమనార్హం.  

ఇదీ చదవండి.. కలుషిత దగ్గు మందు.. ఉజ్బెకిస్థాన్‌ కోర్టు సంచలన తీర్పు 

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top