విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా!

US to lift restrictions Nov 8 for vaccinated foreign travelers - Sakshi

భారత్‌ సహా పలు దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ అగ్రరాజ్యం అమెరికా ఆదేశాలు జారీ చేసింది. కాకపోతే కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. తాజా నిర్ణయం నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. అమెరికాకు వచ్చే ముందు కరోనా వైరస్ పరీక్షనెగిటివ్‌ రిపోర్టును చూపించాల్సి ఉంటుందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ప్రయాణ మార్గదర్శకాలలో టెస్టింగ్ చుట్టూ ప్రోటోకాల్స్ ఉన్నాయి. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం కావడంతో అమెరికా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. 

పూర్తిగా టీకాలు వేసిన ప్రయాణికులు బోర్డింగ్ కు ముందు అమెరికాకు వచ్చిన మూడు రోజుల్లోగా తీసుకున్న ప్రీ-డిపార్చర్ నెగిటివ్ పరీక్షను చూపించాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపింది. టీకాలు వేయని మైనర్లు తాము ప్రయాణిస్తున్న వయోజనుల మాదిరిగానే పరీక్షించాల్సి ఉంటుంది. ప్రకటన ప్రకారం.. ప్రయాణీకులు తమ వ్యాక్సినేషన్ స్టేటస్ చూపించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ రుజువుపై ఉన్న వ్యక్తి ప్రయాణీకుడు అని ధృవీకరించడానికి విమానయాన సంస్థలు పేరు, పుట్టిన తేదీతో సరిపోల్చుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ నుంచి ఇచ్చినటువంటి మినహాయింపునే 18 ఏళ్ల లోపు పిల్లలకూ ఇచ్చింది. వారు అమెరికాకు వచ్చిన 60 రోజుల్లోపు టీకా పొందాల్సి ఉందని చెప్పింది. ప్రయాణం ప్రారంభమైన 72 గంటల్లోపు చేయించుకొన్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్‌ రిపోర్టును సమర్పించాలి.

(చదవండి: అమెరికా సంచలన నిర్ణయం.. వారిని పట్టిస్తే రూ. 74 కోట్లు మీవే!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top