పుతిన్‌.. ప్లీజ్‌ జెలెన్‌స్కీ చెప్పినట్లు చేయండి

Ukraine Shows Video Of Medvedchuk Calling For Mariupol Swap Putin - Sakshi

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఉక్రెయిన్ కుబేరుడు, రష్యా అనుకూల రాజకీయవేత్త విక్టర్ మెద్వెద్చుక్కు సంబంధించిన ఓ వీడియోను ఉక్రెయిన్ తాజాగా విడుదల చేసింది. తాను బందీగా ఉన్నానని, తనను యుద్ధ ఖైదీల మార్పిడి ద్వారా విడుదల చేయాలని మెద్వెద్చుక్ వేడుకోవడంఘా ఆ వీడియోలో ఉంది. 

ఉక్రెయిన్ లోని మేరియుపోల్ నగరాన్ని హస్తగతం చేసుకున్నామని రష్యా ప్రకటించిన కొన్నిగంటల్లోనే ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కోరేది ఒక్కటే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ చెప్పినట్లు చేయండి. రష్యా చెరలో ఉన్న ఉక్రెయిన్ సైనికులు, మేరియుపోల్ పౌరులతో నన్ను మార్పిడి చేసుకోండి. వారిని విడుదల చేసి నన్ను కూడా విడుదల చేయండి" అని మెద్వెద్చుక్ ఆ వీడియోలో సందేశం ఇచ్చాడు. ఆ వీడియోలో మెద్వెద్చుక్ చేతులకు బేడీలతో దర్శనిమిచ్చాడు. 

కాగా, రష్యా ఆక్రమణ పరిణామాల తర్వాత.. అనుకూలవాదులుగా ముద్రపడిన అనేకమందిపై కఠినచర్యలు తీసుకుంది ఉక్రెయిన్‌. వారిలో విక్టర్ మెద్వెద్చుక్ కూడా ఉన్నారు. రాజకీయవేత్తగానే కాకుండా కుబేరుడిగా కూడా పేరుగాంచిన మెద్వెద్చుక్ ఆస్తులను స్తంభింపజేసింది. 32 అపార్ట్ మెంట్లు, 23 లగ్జరీ విల్లాలు, 30 ప్లాట్లు, 26 కార్లు, ఒక విలాసవంతమైన నౌకను స్వాధీనం చేసుకుంది. పుతిన్‌కు మెద్వెద్చుక్‌ చాలా దగ్గర కూడా. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ ఈయన్ని తీసుకుని.. ఉక్రెయిన్‌ ఆడవాళ్లను, పిల్లలను వదిలివేయాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: తల్లీబిడ్డలను బలవంతంగా విడగొడుతున్నారు: జెలెన్‌స్కీ

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top