Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Top 10 Telugu Latest Current News Morning Headlines Today 15th April 2022 5pm - Sakshi

ఉక్రెయిన్‌ మా ఊళ్లలో బాంబులు జారవిడుస్తోంది.. రష్యా తీవ్ర హెచ్చరికలు
ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు మరో మలుపు తిరిగాయి. యాభై రోజులకు పైగా రష్యా బలగాల దాడుల్ని నిలువరించిన ఉక్రెయిన్‌ సైన్యాలు.. ప్రతిదాడులకు తెగపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌ చీఫ్‌కు ‘ఆప్‌’ భారీ ఆఫర్‌.. రెస్పాన్స్‌పై ఫుల్‌ టెన్షన్‌!
ఎన్నికల వేళ గుజరాత్‌ పాలిటిక్స్‌లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్‌గురు.. ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు.

భారత్‌లో ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ నినాదం.. వీడియో వైరల్‌
భారత్‌, పాకిస్తాన్‌ విషయంలో రెండు దేశాలకు సంబంధించిన స‍్లోగన్స్‌ విషయం ఎంతో సున్నితమైనవి. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతి. అలాంటిది.. భారత్‌లో పాకిస్తాన్‌ జిందాబాద్‌.. అంటూ స్లోగన్స్‌తో ఉన్న పాటను వింటున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

బాంబు పేల్చిన ఎలన్‌ మస్క్‌!
ఎలన్‌ మస్క్‌ కాదు కాదు.. సైక్లోన్‌ మస్క్‌(ట్విటర్‌ యూజర్లు ముద్దుగా పెట్టిన పేరు) ట్విట్టర్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 

దీపక్ చహర్‌కు ఒక్క రూపాయి కూడా దక్కకపోవచ్చు!
ఐపీఎల్‌ 2022 సీజన్‌ ప్రారంభానికి ముందు జరిగిన మెగావేలంలో ఇషాన్‌ కిషన్‌ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా దీపక్‌ చహర్‌ నిలిచాడు. రూ.14 కోట్లతో సీఎస్‌కే మూడేళ్ల కాలానికి(రూ.42 కోట్లు) చహర్‌ను దక్కించుకుంది. 

వేసవిలో ఈ జావలు తాగితే శరీర ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు బోలెడు ప్రయోజనాలు
మండే ఎండల్లో శరీరానికి వేడి చేయకుండా చల్లదనాన్ని అదించే వివిధ రకాల జావలను మన పూర్వికులనుంచి తాగుతూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో రకరకాల శీతలపానీయాలకు అలవాటు పడి జావలు తాగడానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. 

రాకీ భాయ్‌ విధ్వంసం.. టాలీవుడ్‌లో రికార్డు
ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో  యష్‌ హీరోగా తెరకెక్కిచ చిత్రం ‘కేజీయఫ్‌ చాప్టర్‌ 2’. భారీ అంచనాల మధ్య గురువారం(ఏప్రిల్‌ 14) విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. 

ఆ వార్తలు ఈనాడులో ఎందుకు రాయడం లేదు: మంత్రి అంబటి ఫైర్‌
ఈనాడు దినపత్రిక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద విషం కక్కుతోందని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 

ప్రియుని ద్వారా నయం కాని రోగం.. భర్తకు మరో పెళ్లి.. ట్విస్టుల మీద ట్విస్టులు
భార్య, ఆమె ప్రియుడిపై భర్త కత్తితో దాడి చేసిన సంఘటన గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో కలకలం రేపింది. పెయింటర్‌గా పనిచేసే సంజన్న, తన భార్యతో హైదరాబాద్‌లో ఉంటున్న క్రమంలో హుజూర్‌నగర్‌కు చెందిన రాంబాబుతో శిరీషకు పరిచయమైంది.

ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా! ఫన్నీ వీడియో చూసేయండి
దాహమేసి దప్పిక తీర్చుకోవడానికి ఓ కొలను దగ్గరికి వెళ్లింది ఓ సింహం. అయితే.. అప్పటికే నీళ్లలో ఉన్న తాబేలు.. దానిని తాగనీయకుండా పదే పదే అడ్డుకుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top