Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌.. ఒక్క క్లిక్‌తో..

Top 10 Telugu Latest Current News Headlines Today 9 April 2022 At 5 PM - Sakshi

చచ్చిపోవడానికి రెడీగా ఉండండి.. మాజీ సీఎంలకు వార్నింగ్‌
మాజీ సీఎంలను చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఏకంగా 63 మందిని ఓ క్షణంలోనైనా చంపేస్తామనడం కర్నాటకలో  సంచలనంగా మారింది. 

పాక్‌ అసెంబ్లీలో ఓటింగ్‌పై సస్పెన్స్‌.. వెన్నుచూపిన ఇమ్రాన్‌
పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. శనివారం పాక్‌ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానంపై కాసేపట్లో ఓటింగ్‌ జరుగనుంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసెంబ్లీకి 176 మంది ఎంపీలు ప్రతిపక్ష నేతలు హాజరు కాగా, అధికార పార్టీ పీటీఐ పార్టీ నుంచి కేవలం 27 మంది ఎంపీలు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు.

అమిత్‌ షాకు కేటీఆర్‌ కౌంటర్‌
బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో కౌంటర్‌ ఇచ్చారు. శనివారం ట్విట్టర్‌ వేదికగా..  దేశంలో ఏ భాష మాట్లాడాలో దేశ ప్రజలను ఎందుకు నిర్ణయించుకోనివ‍్వకూడదు.

అధికార కేంద్రంలోనే పుట్టాను...కానీ దాని పై ఆసక్తి లేదు: రాహుల్‌ గాంధీ
కేంద్రలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన్పటికీ తనకు అధికార పగ్గాల పై ఆసక్తి లేదని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఆయన న్యూఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ...ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

కొందరి వల్లే చెడ్డ పేరు వస్తోంది: శ్రీనివాస్‌ గౌడ్‌
డ్రగ్స్‌ వ్యవహారంతో తెలంగాణ పేరు బద్నాం అవుతోందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. అయితే రాష్ట్రంలో మాదక  ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారని, ఇకపై పరిస్థితి మరోలా ఉంటుందని మంత్రి హెచ్చరికలు జారీ చేశారు.

కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతన కేబినెట్‌ ఏర్పాటుపై కసరత్తు కొనసాగుతుందని.. అన్ని అంశాలను సీఎం జగన్‌ పరిశీలిస్తున్నట్లు సజ్జల తెలిపారు.

త్వరలోనే తమన్నా పెళ్లి? క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ
తమన్నా.. ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అని పిలుపించుకుంటూ కుర్రాళ్ల గుండెళ్లో నిలిచిపోయింది. ఆమె కెరీర్‌లో పెద్దగా హిట్స్‌ లేకపోయినా వరస ఆఫర్లను అందిపుచ్చుకుంది. అందం, అభినయంతో పాటు డాన్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.

చెమట కాయలా? చందనం పొడి, వట్టివేళ్ల పొడిని రోజ్‌వాటర్‌లో కలిపి..
ఎండలు మండుతున్నాయి. దీంతో విపరీతమైన చెమట, దురదలతో చాలా ఇబ్బంది పడిపోతుంటారు. చర్మం తన మృదుత్వాన్ని కూడా కోల్పోతుంది. చెమటకాయలు దురదకు కారణమై, చికాకు, ఆయా భాగాలలో మంట, నొప్పికి దారితీస్తాయి. అతిగా చెమట పట్టే వారిలో వీటి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

పీవీ సింధుకు నిరాశ.. తప్పని ఓటమి
కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. దక్షిణా కొరియాకు చెందిన అన్‌ సియోంగ్‌ చేతిలో సింధు సెమీ ఫైనల్‌లో  ఓటమి పాలైంది.

శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. భారీగా వడ్డీరేట్ల పెంపు
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలాడుతున్న శ్రీలంక ప్రభుత్వం ఉన్న కొద్ది పాటి ఆర్థిక నిల్వలను కాపాడుకునే పనిలో పడింది. అందులో భాగంగా వడ్డీరేట్లను భారీగా పెంచుతూ శ్రీలంక సెంట్రల్‌ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఉన్నపళంగా వడ్డీరేట్లను దాదాపు రెట్టింపు చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top