Stop Suicides: యూరోపియన్ పార్లమెంట్‌లో శ్రీ శ్రీ రవిశంకర్ ప్రసంగం

మానసిక ఆరోగ్యం - విచ్ఛిన్నమైన ప్రపంచం
కోవిడ్ తర్వా త మానసిక ఆరోగ్య సంక్షోభం
ఆత్మన్యూనతతో పెరిగిన ఆత్మహత్యలు
సాంఘిక బంధాలు మెరుగుకు సూచనలు
బ్రస్సెల్స్ : యూరోపియన్ పార్లమెంటులో మానసిక ఆరోగ్యం గురించి ప్రసంగించారు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్. పెరుగుతున్న సామాజిక అశాంతి, హింస, ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పుల గురించి ఇందులో మేధోమధనం చేశారు. దాదాపు 200 పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో పలువురు ఆరోగ్య నిపుణులు, పభ్రుత్వ ప్రతినిధులు, విద్యావేత్తలు పాల్గొన్నా రు.
WHO - ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఏం చెబుతోంది?
* కొవిడ్ తర్వాత పెరిగిన మానసిక సమస్యలు 25%
* ప్రపంచ వ్యాప్తంగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు 100 కోట్ల మంది
* 2020 వరకు ప్రభుత్వాలు ఖర్చు పెట్టిన బడ్జెట్ 2.5 ట్రిలియన్ డాలర్లు
* 2030 నాటికి ప్రభుత్వాలు ఖర్చు పెట్టబోయే బడ్జెట్ 16 ట్రిలియన్ డాలర్లు
ప్రతీ 40 సెకన్లకు ఒక ఆత్మహత్య
కోవిడ్ తర్వాత మనుష్యుల మానసిక స్థితిలో చాలా మార్పు వచ్చిందన్నారు గురుదేవ్ రవిశంకర్. మానసిక ఆరోగ్య సమస్యలు వీపరీతంగా పెరిగాయని, ఇది ఒక్క దేశానికో, ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని, అన్ని దేశాలలో, మతాలలో, వర్గాలలో ఉన్నాయన్నారు. సాంపద్రాయబద్దంగా వస్తున్న పద్దతుల ద్వారా ఈ సంక్షోభాన్ని అధిగమించడం కష్టమని అభిప్రాయపడ్డారు. అన్ని చోట్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Mental Health is one of the greatest challenges the world is facing today. Gave the keynote address about Mental Health at the European Parliament.@IndEmbassyBru @r_czarnecki @wfeb_global @Europarl pic.twitter.com/uN74aJBygn
— Gurudev Sri Sri Ravi Shankar (@SriSri) May 22, 2023
యోగా ఒక్కటే పరిష్కారం
మానసిక రుగ్మతలను సమర్థవంతంగా ఎదుర్కొడానికి ప్రాణాయామం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు గురుదేవ్ రవిశంకర్. "ప్రశాంతంగా ఉన్న మనస్సు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది. మానసిక పశ్రాంతతను సాధించడానికి మన శ్వాస చాలా ముఖ్యమైన పనిముట్టు. మన శ్వాస ద్వారా భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం సాధ్యపడుతుంది. అలాగే ఒత్తిడిని నకారాత్మక ఆలోచనలను అధిగమించవచ్చు" అని తెలిపారు.
The Sixth Sense series in Brussels - an evening of wisdom and meditation at the University of Brussels. pic.twitter.com/mhNX2Ncjmw
— Gurudev Sri Sri Ravi Shankar (@SriSri) May 22, 2023
ప్రాచీన భారతమే పరిష్కార మార్గం
ఈ సమావేశంలో పాల్గొన్న బెల్జియంలో భారత రాయబారి సంతోష్ ఝా కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. "మానసిక ఆరోగ్య సమస్యలు కోవిడ్ తర్వాత ఎక్కువయ్యాయి. ప్రాచీన భారతీయ పద్దతుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు . అలాగే ఈ జ్ఞానాన్ని ఇతర దేశాలకు పంచడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ట్రాఫిక్ జాం అయినప్పు డు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇప్పు డు ఆ ట్రాఫిక్ రూల్స్ లాంటి పద్దతులను మనకు నేర్పించడానికి గురుదేవ్ మనతో ఉన్నా రు" అని చెప్పా రు.
#RaviShankar chairs European Parliament think tank: 'Mental health is an increasing issue affecting the entire world'.#EUToday #MentalHealthMatters https://t.co/kqN4pTSfOO pic.twitter.com/jwzmbg0pm1
— EU today (@EU_today) May 22, 2023
ఈ సమావేశంలో రైజార్డ్ కార్నెకి, గౌరవ సభ్యు లు ఐరోపా పార్లమెంట్, సంతోష్ ఝా, బెల్జియంలో భారత రాయబారి, అలోజ్ పీటర్లె, స్లొవేనియా మాజి పధ్రాన మంత్రి, పాబ్లో సియానో DH, LCEO, ఆచార్య ఆనంద్ నరసింహన్, IMD, బిజినెస్ స్కూ ల్ అధ్యా పకులు, ఆచార్య ఉల్రిచ్ హెగెల్, జర్మన్ డిప్రెషన్ ఫౌండేషన్ అధ్యక్షులు, డాక్టర్ పెట్రా బ్యా చ్, లీషర్ & బ్యా చ్ పెయిన్ థెరపీ వ్యవస్థాపకులు, డాక్టర్ రోలాండ్ లీషర్ బ్యా చ్ లీషర్ & బ్యా చ్ పెయిన్ థెరపీ వ్యవస్థాపకులు పాల్గొన్నారు.