లాప్‌టాప్‌ లాక్కెళ్లిన పంది.. నగ్నంగా అడవంతా..

Naked Man Chases Wild Boar After It Steals His Laptop - Sakshi

బెర్లిన్‌ : బట్టలు లేకుండా బాత్రూం నుంచి బయటకు రావాలంటేనే తెగ ఇబ్బందిగా ఫీల్‌ అవుతాం. నగ్నంగా అందరి ముందు తిరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. తలుచుకుంటేనే సిగ్గుతో చచ్చిపోతాం కదా. కానీ సరిగ్గా ఇలాంటి ఘటనే జర్మనీలో చోటుచేసుకుంది. నగ్నంగా ఓ వ్యక్తి అడవంతా పరుగులు తీశాడు. అసలేం జరింగిందంటే.. బెర్లిన్‌లోని గ్రున్‌ వాల్డ్‌ అడవిలో ఓ వ్యక్తి సరస్సులో దిగి స్నానం చేస్తున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన కొన్ని అడవి పందులు ఆ వ్యక్తి సంచిని ఎత్తుకెళ్లింది. అందులో అతని ల్యాప్‌టాప్‌ కూడా ఉంది. ఇది గమనించిన స్నానం చేస్తున్న ఆ వ్యక్తి  బట్టలు లేకుండానే  అడవి పందుల వెంబడి పరుగెత్తాడు. దీంతో నగ్నంగా ఉన్న వ్యక్తిని అడవిలోని మిగతా సందర్శకులు చూసి తెగ నవ్వుకున్నారు. (ఆస్థి కోసం, త‌ల్లి న‌గ్న చిత్రాల‌ను..)

ఈ దృశ్యాలను స్థానిక అడిలె అనే మహిళ ఫోటో తీసింది. అనంతరం వాటిని అతనికి చూపించగా ఆ వ్యక్తి నవ్వుకున్నాడు. పంది ల్యాప్‌టాప్‌ పట్టుకెళుతోందన్న కంగారులో బట్టలు వేసుకోవడం మర్చిపోయానని సదరు వ్యక్తి తెలిపాడు. అనంతరం వీటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలా అని అడగ్గా.. అతడు అందుకు అంగీకరించాడు. దీంతో ఆ మహిళ వీటిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. అడిలె షేర్‌ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అనేక మంది లైకులు, కామెంట్లు చేస్తున్నారు.  జర్మనీలో నదులు, చెరువుల్లో నగ్నంగా సన్‌బాత్, స్విమ్ చేయడం సర్వ సాధారం. ఇందుకు ప్రభుత్వం కూడా అనుమతిచ్చింది. ఈ సంప్రదాయాన్ని నేచురిజం అంటారు. దీన్నే స్థానికంగా ఫ్రీ బాడీ కల్చర్ అని పిలుస్తారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top