వ్యాక్సిన్‌పై ట్రంప్‌ను నమ్మలేం: కమలా

Kamala Harris says Donald Trump not credible on possible COVID-19 vaccine - Sakshi

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌ అక్టోబరులో అందుబాటులోకి రావొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్న మాటలను తాను నమ్మనని డెమొక్రాటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ ఆదివారం అన్నారు. వ్యాక్సిన్స్‌ సమర్థత, పనితీరుపై విశ్వసనీయమైన సమాచారం ఉంటే తప్ప ట్రంప్‌ మాటలను నమ్మబోనన్నారు. అమెరికాలో కరోనా విజృంభణతో ఇప్పటిదాకా 1.91 లక్షల మందికి పైగా మరణించారు. 63 లక్షల మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. నవంబరు 3న జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ట్రంప్‌ వ్యాక్సిన్‌పై ప్రకటనలు చేస్తున్నారని, తానేదో చేశానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కమల విమర్శించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top