నైలు నదిలో బోటు మునక..19 మంది కూలీల మృతి

Boat Sinks In Egypt Nile 19 Dead - Sakshi

కైరో: ఈజిప్టు రాజధాని కైరో శివార్లలో నైలు నదిలో ఓ ఫెర్రీ బోటు మునిగిపోయింది. గ్రేటర్‌ కైరోలో భాగమైన గిజాలోని మోన్షాత్‌ ఎల్‌ కాంటేర్‌ పట్టణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది దాకా మృతి చెందినట్లు సమాచారం. ఈ పడవలో ప్రయాణిస్తున్న వారంతా దినసరి కూలిలే కావడం విషాదం.

కూలీలంతా ఓ నిర్మాణ సైట్‌లో పనికి వెళుతున్నారు.  ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డవారిని తొలుత ఆస్పత్రికి తరలించి తర్వా త డిశ్చార్జ్‌ చేశారు. పడవ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల ఈజిప్టియన్‌ పౌండ్లు, గాయపడ్డ ఐదుగురికి ఒక్కొక్కరికి 20 వేల పౌండ్ల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

అప్పర్‌ ఈజిప్ట్‌లోని నైలు నది డెల్టాలో ప్రజలు ఎక్కువగా తమ రోజువారి పనుల కోసం ఫెర్రీ బోట్లలోనే ప్రయాణిస్తుంటారు. నిర్వహణా లోపాల వల్ల ఈజిప్టులో రోడ్డు, రైలు, బోటు ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి.  గతంలో జరిగిన బోటు ప్రమాదాల్లోనూ నైలు నదిలో మునిగిపోయి చాలా మంది మరణించినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.

ఇదీ చదవండి.. గాజాలో ఆకలి కేకలు

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top