ఆన్‌లైన్‌లో థాయ్‌రాజు ప్రియురాలి నగ్న ఫోటోలు

1400 Nude Images of Thailand King Mistress Leaked Online Became Viral - Sakshi

థాయ్‌లాండ్‌ రాజు మహా వజీరాలోంగ్‌కాపై వ్యతిరేకతతో కొంతమంది దుండగులు అతని ప్రియురాలు నగ్న ఫోటోలను ఆన్‌లైన్‌లో పెట్టడం సంచలనంగా మారింది. రివేంజ్‌ పోర్న్‌ పేరుతో సైనీనత్‌ వోంగ్వాజీరాపక్డి 1400 నగ్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే వెంటనే స్పందించిన దేశ ఇంటలిజన్స్‌ అధికారులు ఆ ఫోటోలను సోషల్‌ మీడియా నుంచి తొలగించారు. కాగా ఇంటర్‌నెట్‌లో ఫోటోలను తొలగించడానికి ముందే అప్పటికే థాయ్‌లాండ్‌లో రాచరికానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ఆమె నగ్న ఫోటోలను పంపించారు. ఈ ఫొటోలు 2012-14 మధ్యకాలంలో తీసినట్టుగా భావిస్తున్నారు. (చదవండి : వందేళ్ల తర్వాత సేమ్‌ సీన్‌ రిపీట్‌..!)

ఆ  ఫోటలు అందుకున్న వారిలో బ్రిటిష్‌ జర్నలిస్ట్‌ అండ్రూ మెక్‌గ్రెగర్‌ కూడా ఉన్నారు. ఆయన ఈ ఫోటోలపై స్పందించారు. ‘నాకు నాలుగు ఫోన్ల నుంచి సైననీత్‌ నగ్న ఫొటోలు వచ్చాయి. ఆ ఫొటోలను సైనీనత్‌ అనుమతి లేకుండానే నాకు పంపించారు. అందుకే పబ్లిష్‌ చేయవద్దని నిర్ణయించుకున్నా. ఈ ఫొటోలన్నీ సైనీనత్‌ తన సొంతంగా తీసుకొన్నవేనని ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. బహుశా రాజుకు పంపడానికి అప్పట్లో ఈ ఫొటోలను తీసి ఉంటారని' మెక్‌గ్రెగర్‌ చెప్పారు.

థాయ్ రాజు మహా వజీరాలోంగ్‌కార్న్ 2019 లో సైననీత్‌ వోంగ్వాజీరాపాక్డిని తన అధికారిక చెలికత్తెగా నియమించుకున్నాడు. విదేశాలలో పైలట్‌గా శిక్షణ పొందిన సైనినాత్‌ కింగ్స్ రాయల్ బాడీగార్డ్ యూనిట్‌లో పనిచేసింది. అనంతరం థాయిలాండ్ కింగ్స్ గార్డ్‌లో మేజర్ జనరల్ హోదాను పొందారు. కాగా మహారాజు సైననీత్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో అతని భార్య సుథీదా ఆమెను జైలు పాలయ్యేలా చేసింది. కాగా ఇటీవలే సైననీత్‌ జైలు నుంచి విడుదలయిన కొన్నిరోజులకే ఆమె నగ్న ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రచురితమయ్యాయి. దీని వెనుక మహారాణి సుథీదా హస్తం ఉండొచ్చని భావిస్తున్నారు.(చదవండి : ఇలా ప్రపోజ్‌ చేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top