No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Thu, May 30 2024 7:45 PM

-

బంజారాహిల్స్‌: వరల్డ్‌ నో టొబాకో డేను పురస్కరించుకుని ఈ నెల 31న ఉచిత కేన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంప్‌ నిర్వహించనున్నట్లు బంజారాహిల్స్‌ బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ యాజమాన్యం ప్రకటించింది. శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పొగాకు వినియోగించే వారి కోసం ప్రత్యేకంగా ఉచిత కేన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంపును ఏర్పాటు చేశామన్నారు. నిపుణులైన వైద్యులు ఉచితంగా ప్రాథమిక పరీక్షలు నిర్వహించి కేన్సర్‌ లక్షణాలను నిర్ధారిస్తారని ఇనిస్టిట్యూట్‌ ప్రతినిధులు తెలిపారు. అనుమానం ఉన్న వారికి 20 శాతం రాయితీతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారన్నారు. ఈ సదుపాయాన్ని పొగాకు వినియోగించే వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 040– 2355 1235, ఎక్స్‌టెన్షన్‌ 2335, 2354, 2216లలో సంప్రదించవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement