No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Thu, Feb 29 2024 7:48 PM

- - Sakshi

గోల్కొండ: తెలంగాణలో టూరిజం ప్రమోషన్‌లో భాగంగా సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ తెలుగు వారియర్స్‌తో భాగస్వామి అవుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం గోల్కొండ తారామతి బారాదరిలో ప్రీ ఈవెంట్‌ మీట్‌ ఆఫ్‌ తెలుగు వారియర్స్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.... మార్చి 1 నుంచి 3 వరకు ఉప్పల్‌ స్టేడియంలో జరుగనున్న 2వ దశ సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌కు ఈ సారి విశేష స్పందన రావడం ఖాయమన్నారు. తెలుగు వారియర్స్‌తో తమ శాఖ జతకట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలుగువారియర్‌ టీమ్‌ ప్లేయర్స్‌తో ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో సుధీర్‌బాబు, ఆది, సుశాంత్‌, ప్రిన్స్‌, అశ్విన్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ప్రముఖ సంగీత దర్శకుడు థమన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులకు ఆల్‌దబెస్ట్‌ తెలుపుతూ ‘మీ అందరినీ చూస్తుంటే తాను చిన్నప్పుడు క్రికెట్‌ ఆడిన రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు’. సినిమాతారలు, క్రికెటర్లు ఒకే వేదికపై కనబడితో ప్రేక్షకులకు కన్నుల పండుగేనని అన్నారు. సీసీఎల్‌ను విజయవంతం చేయడానికి తమ అండదండలు ఉంటాయని, తెలంగాణలో టూరిజం అభివృద్ధికి భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ డైరెక్టర్‌ నిఖిల, కార్పొరేషన్‌ ఎండీ రమేష్‌ నాయకుడు సీసీఎల్‌ వ్యవస్థాపకులు విష్ణు ఇందూరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement